“బాల్యపు చల్లని
మెల్లని బుడిబుడి నడకలు
గల్ గల్లున మోగే
మువ్వల చిట్టిపొట్టి పరుగులు
చిట్టిపరుగులు..అలా..అలా..
గట్టిపరుగులై
పరుగులే పరుగులు
పరుగులు.
చదువుల్లో ర్యాంకులకోసం
పరుగులు.
పేరున్న కంపెనీలలో
ఉధ్యోగంకోసం పరుగులు.
ఎక్కువ జీతం ఇచ్హే
కంపెనీల కోసం పరుగులు.
ఉధ్యోగం చేస్తూ
కూడా ఎక్కువ కట్నం తెచ్హే భార్య కోసం పరుగులు.
పరాయిదేశాల డాలర్ల
కోసం పరుగులు.
ఉధ్యోగంలో ఆధిపత్యంకోసం
పరుగులు.
ఇంట్లో సౌకర్యాల
కోసం పరుగులు.
బయట పేరుగొప్పల
కోసం పరుగులు.
పిల్లల చదువుల
కోసం పరుగులు.
వాళ్ళ భవిష్యత్
కోసం పరుగులు.
పరుగులు.
పరుగెత్తీ పరుగెత్తీ
అలసిపోయి వళ్ళంతా పులిసిపోయాకా
తెలుస్తుంది.
అసలు వేటికోసం
పరుగెత్తామో అవే దొరకలేదని.
తన జీవితకాలంలో ఆనందాన్ని, శాంతిని,
సంతోషాన్ని, ప్రేమను పొందడానికి
కావలసినంత కష్టపడలేనివాడు బ్రతుకుతున్న శవంలా జీవిస్తాడు చచ్హే వరకూ..