Type Here to Get Search Results !

శ్రీ కామాక్షీ స్తోత్రమ్

0

 

 కాఞ్చీనూపురరత్నకఙ్కణలసత్కేయూరహారోజ్జ్వలాం కాశ్మీరారుణకఞ్చుకాఞ్చితకుచాం కస్తూరికాచర్చితామ్  కల్హారాఞ్చితకల్పకోజ్జ్వలముఖీం కారుణ్యకల్లోలినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౧॥

 కామారాతిమనఃప్రియాం కమలభూసేవ్యాం రమారాధితాం కన్దర్పాధికదర్పదానవిలసత్సౌన్దర్యదీపాఙ్కురామ్ । కీరాలాపవినోదినీం భగవతీం కామ్యప్రదానవ్రతాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౨॥

 కాదమ్బప్రమదాం విలాసగమనాం కల్యాణకాఞ్చీరవాం కల్యాణాచలపాదపద్మయుగలాం కాన్త్యా స్ఫురన్తీం శుభామ్ । కల్యాణాచలకార్ముకప్రియతమాం కాదమ్బమాలాశ్రియం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౩॥
 గన్ధర్వామరసిద్ధచారణవధూధ్యేయాం పతాకాఞ్చితాం గౌరీం కుఙ్కుమపఙ్కపఙ్కితకుచద్వన్ద్వాభిరామాం శుభామ్  గమ్భీరస్మితవిభ్రమాఙ్కితముఖీం గఙ్గాధరాలిఙ్గితాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౪॥
 విష్ణుబ్రహ్మముఖామరేన్ద్రవిలసత్కోటీరపీఠస్థలాం లాక్షారఞ్జితపాదపద్మయుగలాం రాకేన్దుబిమ్బాననామ్  వేదాన్తాగమవేద్యచిన్త్యచరితాం విద్వజ్జనైరావృతాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౫॥
 మాకన్దద్రుమమూలదేశమహితే మాణిక్యసింహాసనే దివ్యాం దీపితహేమకాన్తినివహాం వస్త్రావృతాం తాం శుభామ్  దివ్యాకల్పితదివ్యదేహభరితాం దృష్టిప్రమోదార్పితాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౬॥
 ఆధారాదిసమస్తచక్రనిలయామాద్యన్తశూన్యాముమాం ఆకాశాదిసమస్తభూతనివహాకారామశేషాత్మికామ్ । యోగీన్ద్రైరపి యోగినీశతగణైరారాధితామమ్బికాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౭॥

 హ్రీఙ్కారప్రణవాత్మికాం ప్రణమతాం శ్రీవిద్యవిద్యామయీం ఐం క్లీం సౌం రుచి మన్త్రమూర్తినివహాకారామశేషాత్మికామ్ । బ్రహ్మానన్దరసానుభూతిమహితాం బ్రహ్మప్రియంవాదినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౮॥

 సిద్ధానన్దజనస్య చిన్మయసుఖాకారాం మహాయోగినీం మాయావిశ్వవిమోహినీం మధుమతీం ధ్యాయేత్ శుభాం బ్రాహ్మణీమ్ । ధ్యేయాం కిన్నరసిద్ధచారణవధూ ధ్యేయాం సదా యోగిభిః కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౯॥

 కామారికామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కఙ్కణచూడహస్తాం । కాఞ్చీనివాసాం కనకప్రభాసాం కామాక్షిదేవీం కలయామి చిత్తే ॥ ౧౦॥

 ఇతి శ్రీ కామాక్షీస్తోత్రం సమ్పూర్ణమ్ ।

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages