హరి నీప్రతాపమున కడ్డమేది లోకమున | సరి వేరీ నీకు మరి సర్వేశ్వర ||
చరణం
|| నీవు నీళ్ళు నమలితే
నిండెను వేదములు | యీవల
దలెత్తితేనే యింద్రపదవులు మించె |
మోవ మూతి గిరిపితే మూడు లోకాలు నిలిచె | మోవిబార నవ్వితేనే ముగిసి రసురులు ||
|| గోర గీరితే
కొండలెల్ల దెగబారె | మారుకొంటే
బయటనే మడుగులై నిలిచె |
చేరి యడుగువెట్టితే శిలకు బ్రాణము వచ్చె | కూరిమి గావలెనంటే కొండ గొడగాయను ||
|| కొంగుజారినంతలోనే
కూలెను త్రిపురములు | కలగి
గమనించితేనే కలిదోషములు మానె |
రంగుగ నీశరణంటే రక్షించితి దాసులను | ముంగిట శ్రీవేంకటేశ మూలమవు నీవే ||