కొవ్వొత్తి మండుతున్నప్పుడు కరుగుతూ
ద్రవరుపం లోకి మారుతున్న మైనము , వత్తిలో ఉన్న
అతి సన్నని మార్గాలగుండా పైకి ఎగబాకుతుంది . ఈ ప్రక్రియను కేశనాలికీయత (capillarity) అంటారు . పారఫిన్ వేక్స్ (మైనం) క్రూడ్ ఆయిల్ నుంచి లభించే ఒక
రకమైన హైడ్రోకార్బన్ . మనం కొవ్వొత్తిలొని వత్తిని వెలిగించినపుడు ఉత్పన్నమైన ఉష్ణము
వత్తిచుట్టు ఉండే కొవ్వును కరిగిస్తుంది . అలా కరిగి ద్రవ రూపం లో ఉన్న మైనాన్ని వత్తి
పీల్చుకొని ఆ ద్రవాన్ని పైవైపునకు లాగుతుంది . మంటలోని ఉష్ణం పైకి వచ్చిన మైనపు ద్రవాన్ని
భాష్ప రూపంలోకి మార్స్తుంది . ఆ విదంగా కొవ్వొత్తి లో మండేది భాష్ప(ఆవిరి)రూపం లో ఉండే
మైనమే .
మండుతున్న కొవ్వొత్తిని తటాలున ఆర్పేస్తే
, వత్తి నుంచి వెలువడే తెల్లని పొగ
ఒక ప్రవాహం లాగా పైకిపోవడం గమనిస్తాం . ఈ పొగ కంటికి కనబడే విధంగా ఘనీభవించిన పారఫిన్
మైనం భాస్పమే . వత్తి వేడిగా ఉన్నంతవరకు ఈ తెల్లని పొగ పవాహ రూపము లో వస్తూనే ఉంటుంది
.
