సంఘటనలు
- 1804 – స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది.
- 2007 - 2007 ఫిబ్రవరి 21 నాడు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగాయి చూడు విశాఖపట్నం వార్డులు
- 2013 - హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
- 2022: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశాడు.
జననాలు
- 1894: శాంతిస్వరూప్ భట్నాగర్, శాస్త్రవేత్త (మ.1955).
- 1907: ఎం.ఆర్.రాధా, తమిళ సినిమా, రంగస్థల నటుడు
- 1909: వసంతరావు వేంకటరావు, సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
- 1928: ఆర్.గోవర్ధన్ ,సంగీత దర్శకుడు (మ.2017).
- 1939: సత్యపదానంద ప్రభూజీ హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015)
- 1945: సుధీర్ నాయక్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు
- 1951: డా.దేవరాజు మహారాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు
- 1965: కీత్ ఆథర్టన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
- 1976: విజయ ప్రకాష్ , దక్షిణ భారత గాయకుడు,సంగీత దర్శకుడు
- 1977; రంజిత్, నేపథ్య గాయకుడు
- 1983: వేదిక : దక్షిణ భారత చలన చిత్ర నటి , మోడల్
మరణాలు
- 1941: ఫ్రెడరిక్ బాంటింగ్, కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత
- 1971: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (జ.1902)
- 2010: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933)
- 2011: ఎమ్.పీతాంబరం, తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు
- 2022: మేకపాటి గౌతమ్‌రెడ్డి, వ్యాపారవేత్త, రాజకీయవేత్త, శాసనసభ సభ్యుడు. (జ.1972)
పండుగలు , జాతీయ దినాలు
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం