రాగి జావా వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
చాలా చవకగా, చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే
వంటల్లో రాగి జావ(Ragi Java) ఒకటి. ఇది మీరు రోజూ ఒక
మోతాదులో తీసుకుంటే చాలు. మీకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. అందుకే
డాక్టర్లు రాగిజావను రోజుకు ఒక్కసారైనా తీసుకోవాలంటున్నారు. ఇంతకీ రాగిజావ వల్ల
కలిగే లాభాలు(Benefits) ఏమిటి? దీనివల్ల
సైడ్ ఎఫెక్ట్స్(Side effects) ఏమైనా ఉన్నాయా? రోజూ రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి
చాలా మంచిది అంటున్నారు. వివిధ సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని హ్యాపీగా
తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే రాగి జావ అద్భుతమైన పోషకాహార
ప్రొఫైల్(Nutrition Profile)ను కలిగి ఉంటుంది. విటమిన్లు,
మినరల్స్, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్‌ల
వంటి అన్ని అవసరమైన స్థూలపోషకాలను కలిగి ఉంటుంది. దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్,
సోడియం స్థాయిలను కలిగి ఉంటుంది. విటమిన్ సి, ఇ
కూడా ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు థయామిన్, రిబోఫ్లావిన్,
నియాసిన్, ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్,
ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. మరి దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య
ప్రయోజనాలు ఏమిటో?, దుష్ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు
తెలుసుకుందాం.
ప్రయోజనాలు:
రాగి జావలో కనిపించే ప్రధాన ప్రోటీన్ కంటెంట్(Protein
Content) ఎలుసినియన్(Eleusinian). ఇది అధిక
జీవ విలువను కలిగి ఉంటుంది. ఇది పోషకాహార లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్(Oxygen)ను
రవాణా చేయడంలో సహాయం చేస్తుంది. రాగిజావలో ఫైబర్
ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. ఇది అతిగా
తినడాన్ని నిరోధిస్తుంది. అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. మలబద్ధకం
నుంచి ఉపశమనం పొందుతారు. రాగి జావను రోజూ తీసుకుంటే ఆందోళన(Tension), డిప్రెషన్(Depression), నిద్రలేమి (Insomnia
)సమస్యలు తగ్గుతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు(Anti
oxidants), ట్రిప్టోఫాన్(tryptophan,), అమైనో
ఆమ్లాలు(Amino Amla), సహజ సడలింపుగా పని చేసి.. మీకు
విశ్రాంతిని అందిస్తుంది. అయితే రాగి జావను రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదు. మీకు
జీర్ణ సమస్యలు(Digestion Problems) లేదా గ్లూటెన్ అలెర్జీలు(Gluten
Allergies) ఉంటే నైట్ తీసుకోకండి.
రాగి జావను రోజూ తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే రాగి
జావలో పాలీఫెనాల్స్(Polyphenols), డైటరీ
ఫైబర్‌లు(Dietary Fibers) ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం(Magnesium)
ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడానికి తగినంత
ఇన్సులిన్‌ను స్రవించదు. రాగి జావలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇది సోడియం లేనిది.
కాబట్టి మీకు గుండె జబ్బు ఉన్నప్పటికీ రాగి పిండి ఆధారిత వంటకాలను తినడం
సురక్షితమే. అదనంగా డైటరీ ఫైబర్స్, విటమిన్ B3
(Niacin) అధికంగా తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన HDL స్థాయిలను పెంచడంతో పాటు LDL స్థాయిలను
తగ్గిస్తుంది. ఇది గుండె కండరాల పనితీరు, గుండె ఆరోగ్యాన్ని
మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాగి జావ సహజ ఇనుము(Iron)కు
గొప్ప మూలం. రక్తహీనత ఉన్నవారికి, తక్కువ హిమోగ్లోబిన్
స్థాయిలు(Hemoglobin) ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
రాగి మాల్ట్ విటమిన్ సి స్థాయిలను పెంచుతుంది. రక్తప్రవాహంలోకి ఇనుము శోషణను
సులభతరం చేస్తుంది. ఇది ఐరన్-రిచ్ సూపర్‌ఫుడ్. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను
పెంచుతుంది.
రాగి జావలో కాల్షియం ఉంటుంది. కాల్షియం అనేది ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి
సహాయపడే ఖనిజం(Mineral). మానవ శరీరం రోజూ మన ఎముకల
నుంచి చిన్న పరిమాణంలో కాల్షియంను తొలగిస్తుంది. కాబట్టి మనం కాల్షియం అధికంగా
ఉండే ఆహారాలను తీసుకోవాలి. రాగి పిండిలో అత్యధిక మొత్తంలో భాస్వరం ఉంటుంది. ఇది
ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది. రాగి
జావలో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది మీ చర్మానికి మేలు చేస్తుంది. విటమిన్ ఇ(Vitamin
E) శరీరంపై గాయాలకు సహజ మందు. ఇది మీ చర్మంపై రక్షిత పొరను
ఏర్పరుస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. ఇది రక్త
ప్రసరణ(Blood Circulation)ను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను
ప్రోత్సహిస్తుంది.
రాగి జావ వల్ల కలిగే దుష్ప్రభావాలు
అధిక బరువు ఉన్నవారు లేదా మధుమేహం వంటి కొన్ని జీవనశైలి రుగ్మతలు ఉన్నవారు
రాగిజావను తీసుకోవచ్చు. అయినప్పటికీ.. దీనిని మీరు ఎక్కువగా తీసుకుంటే.. కొన్ని
దుష్ప్రభావాలు ఉంటాయి అంటున్నారు. అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వచ్చే అవకాశముంది.
మూత్రపిండాల్లో రాళ్లు(Kidney stones) లేదా మూత్ర విసర్జన
సమస్యలు(Urinary problems) ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే
మంచిది. బరువు పెరగాలనుకునేవారు దీనిని కొంచెంగా తీసుకోవచ్చు. కొందరికి దీని వల్ల
అలర్జీ రావచ్చు.
అలా ఏమైనా అనిపిస్తే మీరు వెంటనే దానిని తీసుకోవడం ఆపేయండి.