పెద్దయ్య పలుకులు
కష్టపడితే గెలుపు
జీవితంలో మలుపు
చరిత్ర అదే అదే
మనందరికీ తెలుపు
అన్నింటిపై అదుపు
కల్గియుంటే పొదుపు
కుటుంబాన ఉండదు
ఖచ్చితంగా కుదుపు
అసూయ పెద్ద కురుపు
భీకరమైన అరుపు
ఆదిలో త్రుంచుకో!
బ్రతుకిక పూల
పరుపు
మల్లె మాలిక తెలుపు
మనిషి రుధిరము
ఎరుపు
దిద్దుకుంటే మేలు
నీచగుణాలు నలుపు
-గద్వాల సోమన్న,9966414580