Type Here to Get Search Results !

నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ( ప్రెసిడెంట్ గారి పెళ్ళాం) Song Lyrics

0

చిత్రం : ప్రెసిడెంట్ గారి పెళ్ళాం  (30.10.1992)

గానం : బాలు, చిత్ర

సంగీతం : కీరవాణి

తారాగణం : నాగార్జున , మీనా

గీత రచయిత: వేటూరి

దర్శకుడు:  కోదండరామిరెడ్డి

 

President Gari Pellam Songs | Nuvvu Malleteega Song Lyrics| Nagarjuna | Meena


నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ

ఓసి కందిరీగ వేసుకోవె పాగ

నువ్వు చందమామ నాది సందె ప్రేమ

కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా

తెల్లచీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశా

అడ్డు చెప్పినా ఆగడే బావా తెడ్డుకోరెనె పూల నావా

సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ

ఓసి కందిరీగ వేసుకోవె పాగ

నువ్వు చందమామ నాది సందె ప్రేమ

కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా

 

పెదాలకు చేరెను పెళ్ళికి చెందిన సందడి నీ ముద్దులాగ

వయస్సున కూసె వసంతం లాడిన కోరిక సన్నయిలాగ

రుచించిన చెక్కిల్లలో రచించిన చేరాతలే

వరించిన వారాలలో స్మురించెను శుభలేఖలై

మనసే మనువాడుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ

ఓసి కందిరీగ వేసుకోవె పాగ

నువ్వు చందమామ నాది సందె ప్రేమ

కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా

 

ముఖాలకు వేసిన ముచ్చిక సిగ్గుల లేఖలు రా రమ్మనేగా

సుఖాలుగ మారెను ఇద్దరి వత్తిడి ప్రేమలు ఈ మధ్యనేగా

కథే ఇక మారిందిలే గతే ఒక్కటవుతుందిలే

కలేసిన కాలాలలో కలే నిజమయ్యిందిలే

తొడిమే తడి చేసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ

ఓసి కందిరీగ వేసుకోవె పాగ

నువ్వు చందమామ నాది సందె ప్రేమ

కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా

తెల్లచీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశా

అడ్డు చెప్పినా ఆగడే బావా తెడ్డుకోరెనె పూల నావా

సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ

ఓసి కందిరీగ వేసుకోవె పాగ

నువ్వు చందమామ నాది సందె ప్రేమ

కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా

 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages