Type Here to Get Search Results !

సొగసు చూడ హాయి హాయిలే (ధర్మ చక్రం)

0

 సినిమా టైటిల్:-ధర్మ చక్రం

నటీనటుల బృందం:-వెంకటేష్, రమ్య కృష్ణ

సంగీతం:-MM శ్రీలేఖ

దర్శకత్వం:-సురేష్ కృష్ణ

భాష:-తెలుగు

సంవత్సరం:-1994


Sogasuchuda Song lyrics | Dharma Chakram Telugu Movie | Venkatesh | Prema | SP Music

 

సొగసు చూడ హాయి హాయిలే

తెలిసె నేడు ఇంత హాయి...

హాయి... హాయి

చెలియ చూపు నీకు హాయిలే

చెలిమిలోన ఉంది హాయి హాయి

అందాలు చూడ జన్మ చాలునా

అందించగానె ఆశ తీరునా

అహో ఇదెంత వింత మోహమో

 

చరణం : 1

నువ్వంటే నేనంటు నేనంటే నువ్వుంటు

నీవెంట నేనుండనా

నీ నవ్వే ముద్దంటు

ఇంకేమి వద్దంటు ముడిపడనా

నీకోసం పుట్టాను నీ దారే పట్టాను

నీమీదే ఒట్టేయనా

నా చేత చేయ్యెట్టు

నన్నిట్టా జోకొట్టు ఒడిలోన

చెట్టా పట్టా కట్టేదెట్టో

ఇట్టే చెప్పేయాలమ్మా

చెట్టు పుట్ట చూసే వేళ తప్పేదెట్టయ్యా

కుమారి చెంపకెన్ని కెంపులో

వరించు కళ్లకెన్ని రంగులో

అహో ఇదెంత వింత మోహమో

 

చరణం : 2

నా పాలబుగ్గల్లో దీపాల సిగ్గుల్లో

నీపాలు పంచివ్వనా

ఈ వెండి వెన్నెల్లో

నీ గుండె చప్పుళ్లు వినలేనా

హద్దుల్ని దాటాలి వద్దన్న చూడాలి

నీ కన్నె కవ్వింపులు

కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి

పదనిసలు

నిన్న మొన్న లేనేలేని

వైనం ఎంతో బాగుంది

వన్నె చిన్నె ఊరించాకే ప్రాణం లాగింది

సయ్యాటలాడ ఎంత తొందరో

వయ్యారి ఈడుకెన్ని చిందులో

సుఖాల తీరమెంత దూరమో

  

 



Click Here to Download Audio Song


 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages