ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో .... ఓ ఓ ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో దాచిన బడబానలమెంతో.. భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో........ఆఆఆఆ..... ఆఆఆఆఆ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలిఐన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో .... ఓ ఓ ఓ మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో.......... ఓ ఆఆఆ.. ఆఆఆఆ... ఆఆఆఆఆ రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతొ కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతొ దనవంతుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో .... ఓ ఓ ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో.............................. ఓ ఆఆఆఆ... ఆఆఆఆఆ...ఆఆఆఆఆఆ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో . గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో .... ఓ ఓ ఓ