Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జూలై 12

0

 

సంఘటనలు

 

1961: పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.

1979: కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.

 

జననాలు

 

  • క్రీ.పూ. 101/102 - జూలియస్ సీజర్.
  • 1884 : ఫ్రాన్సులో అధికంగా పనిచేసిన ఒక ఇటాలియన్ కళాకారుడు అమేడియో మొడిగ్లియాని జననం (మ.1920).
  • 1904: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973)
  • 1906: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981)
  • 1930: ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991)
  • 1933: గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (మ.2017)
  • 1955: నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
  • 1957: శ్రీలక్ష్మి రేబాల, నటి, భరతనాట్య కళాకారిణి.
  • 1958: శిలాలోలిత, కవయిత్రి, విమర్శకురాలు.
  • 1977: బ్రాక్ లెస్నర్, అమెరికన్ మిశ్రమ రణతంత్ర యోధుడు, మాజీ వృత్తిగత, ఔత్సాహిక మల్లయోధుడు.
  • 1982: ఆచంట శరత్ కమల్, టేబుల్ టెన్నిస్ ఆటగాడు.1997 nagu babu

 

 

మరణాలు

 

  • 1803: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703)
  • 1840 : కర్నూలు గత నవాబ్ గులామ్ రసూల్ రసూల్ ఖాన్ మరణం
  • 1923: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877)
  • 1985: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923)
  • 1994: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924)
  • 1999: రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929)
  • 2012: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928)

 

 

జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

 

  • కిరిబతి స్వాతంత్ర్యదినం. యునైటెడ్ కింగ్ డం నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది.
  •  సావొ టోమే, ప్రిన్చిపె దీవుల స్వాతంత్ర్య దినం. పోర్చుగల్ నుంచి 1975 లో స్వాతంత్ర్యం పొందింది.
  • నాబార్డ్ స్థాపక దినోత్సవం.
  • బెల్జియం జాతీయ దినం.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages