అతిథిజనుల వీడి అభ్యాగతుల వీడి
దేవతలకు నిడక తినెడివాని
చెప్పనగు ధరిత్ర జీవన్మృతుం డని
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: అతిథులను సాదరంగా ఆహ్వానించి
గౌరవించని వ్యక్తి జీవితం అర్థరహితమని చెప్పే పద్యం. అతిథులను సత్కరించడం మన
సంస్కృతి లో ముఖ్యమైన భాగం, దానిని విస్మరించవద్దని హెచ్చరిస్తుంది.