ఇనుడు వెలుగునిచ్చు ఘనుడు
వర్షమునిచ్చు
గాలి వీచు చెట్లు పూలుపూచు
సాధుపుంగవులకు సహజలక్షణమిది
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: మంచివారు తమ సహజ లక్షణాలను
ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ప్రదర్శిస్తారు. ఉదాహరణకు, వాన
నీటిని అందిస్తుంది, గాలి చల్లదనం అందిస్తుంది, చెట్లు పువ్వులు పూస్తాయి. అలాగే సత్పాత్రులు సమాజానికి ఉపయుక్తంగా
ఉంటారు.