కాకికోకిలమ్మలేక వర్ణమ్ములే
సుంత తెలియదయ్యె నంతరంబు
గుట్టు బైటపడియె గొంతెత్తినంతనే
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: శరీరంలో ఎలాంటి తేడా
లేకపోయినా, గానం పరంగా కాకికి, కోకిలకీ తేడా
ఉంటుంది. కవిత్వం ప్రకారం, ఒకరికి ఉన్న ప్రత్యేకతను చూసి
అనుసరించాలి కానీ ఎవరినీ అనుకరించడానికి ప్రయత్నించకూడదు అని చెబుతోంది.