సాధు సంగమమున సామాన్యుడును గూడ
మంచి గుణములను గ్రహించుచుండు
పుష్పసౌరభంబు పొందదా దారంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: సత్సంగతి సాధారణ వ్యక్తికీ
మంచి గుణాలను నేర్పగలదు. పుష్పం ద్వారా త్రాడు సౌరభాన్ని పొందినట్లుగా, మంచి
గుణాలు కూడా మంచి వాతావరణంలో ఉంటే సులభంగా సాధ్యమవుతాయి అని చెబుతోంది.