Text Book Page No: 1
చిత్రం చూడండి.
ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు
జవాబులు చెప్పండి.
1. చిత్రంలో మీకు
ఏమేమి కనిపిస్తున్నాయి?
చిత్రంలో ఇంద్ర
దనస్సు, మేఘాలు, కొండలు, కొండల మధ్య నుండి
వాగు, చెట్లు, కాడిఎడ్లు, చిన్న గ్రామం, రైతు, పశువులు,
ఆడుకుంటున్న పిల్లలు, గంప తలకెత్తుకున్న ఆడ మనిషి,
పక్షులు కనిపిస్తున్నాయి.
2. చిత్రంలో ఎవరెవరు
ఏమేమి చేస్తున్నారు ?
చిత్రంలో ఒక
ఆడమనిషి తల పైన గంప పెట్టుకుని గంపలో పండ్లు పెట్టుకుని వెళోంది. ఆ ప్రక్కనే ఐదుగురు
చిన్న పిల్లలు ఒకరిచేతులు మరొకరు పట్టుకుని ఆడుకుంటున్నారు. వాగుకు అవతలివైపు రైతు
తన ఎడం భుజం పైన మోపును పెట్టుకుని, కుడిచేతితో కొడవలిని పట్టుకుని నడుస్తున్నాడు.
జోడెద్దులు మెడ పైన కాడివేసి రైతు వంతెన దాటిస్తున్నాడు. పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
Text Book Page No: 4
ఇవి చేయండి
వినడం – ఆలోచించి
మాట్లాడటం
1. పాటను రాగయుక్తంగా
పాడండి.
2. పాట భావం సొంత
మాటల్లో చెప్పండి.
ఇది రాయలసీమ
లోని పెన్నేటిపాట. ఇక్కడ నివసించే కోటి గొంతుల కిన్నెర వీణల తీగలను మీటుకుంటూ, కోటి గుండెల కంజరులను
మోగిస్తూ మీకు ఈ పెన్నేటి పాటను వినిపిస్తాను అంటున్నాడు కవి)
ఏదీ ! ఇక్కడ
ప్రవహించే పెన్న ఏదీ కనిపించదే పినాకిని (పెన్నకు మరో పేరు). ఓ ! ఇదే పెన్న. ఇదే పినాకినీ.
ఆ మహా ప్రవాహం ఇప్పుడు లేదు. ఈ ఎండిపోయిన ఇసుక నేలయే ఆ పినాకిని. ఏది ! ఆ నీరు! ఆ హోరు, ఆ ప్రవాహం . ఓ
ఇదే ఆ నీరు, ఆహోరు, ఆ ప్రవాహం. ఓ! తమ్ముడా!
నిదానించి నడు. హృదయం చీల్చుకుపోయే బాధ కలిగించే ఒట్టి ఎడారి ఇది.
కుండపోతగా
వర్షం కురిసినా! ఇట్టే పట్టుమని పది రోజులలో ఈ ఇసుక సందుల బొక్కసాల్లోకి ఇంకి పోతుంది.
నిశ్శబ్దంగా నేల అడుగు పొరల్లో నిద్రిస్తుంది.
కానీ ఈ ఏటి
నీటిలో కమ్మదనముంటుంది. దోసిలితో తీసి ఒక్కసారి పుక్కిలిస్తే చాలు పుట్టుకకు సార్ధకత
ఏర్పడుతుంది. మనసులోని కల్మషం పోయి నిష్కల్మషత్యం అబ్బుతుంది.
అలాంటిది ఇంత
మందిని కన్న తల్లి, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిలా మారిపోయిందో! ఎందుకిలా ఎండిపోయిందో,
తమ్ముడు. ఇదే పెన్నేటిపాట.
3. మీకు తెలిసిన
నది/ సెలయేరు / చెరువు / కాలువల గురించి మాట్లాడండి.
నాకు తెలిసిన
నది – కృష్ణానది :
కృష్ణానది
భారతదేశంలోని అతి పెద్ద పొడవైన నదుల్లో మూడవది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్దనది.
నీటి ప్రవాహం పరంగా కృష్ణానది మన దేశంలో నాల్గవది. తెలుగు ప్రాంతం వారు కృష్ణానదినే
‘కృష్ణవేణి’ అని గూడా పిలుస్తారు.
ఈ నది మహాబలేశ్వరంలో
పుట్టి హంసలదీవి దగ్గర సముద్రంలో కలుస్తోంది. పుట్టిన ప్రదేశం నుండి తనలో – కొయినా, వర్ణ, పంచగంగ, దూద గంగ, ఘటప్రభ,
మలప్రభ, భీమా, తుంగభద్ర,
దిండి, మూసి, పాలేరు,
మున్నేరు, మొదలైన చిన్న చిన్న నదులను తనలో కలుపుకుంటూ
విజయవాడ ప్రకాశం బ్యారేజిని దాటి దివిసీమలో హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
కృష్ణానదీ పరివాహక ప్రాంతం సారవంతమై, సకల మానవాళికి అన్నదాత అయినది.
చదవడం – వ్యక్త
పరచడం
అ) గేయం ఆధారంగా
ప్రాస పదాలు గుర్తించండి, రాయండి.
జవాబు:
మీటుకొనుచు
– కొట్టుకొనుచు
“ఏది
పెన్న – ఏది పెన్న” – “ ఇదే పెన్న – ఇదే పెన్న”
ఏది? నీరు – ఏది హోరు?
నీటి జాలు
– ఇసుక వాలు
నిదానించి
నడు – ఎడారి తమ్ముడు
ఎందుకిట్లు
మారెనో – ఎందుకెండిపోయెనో !
ఆ) పేరాను
చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
మన రాష్ట్రంలోని
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో “నాగావళి” ముఖ్యమైన నది. ఇది ఒడిశా రాష్ట్రంలో
ప్రారంభమవుతుంది. నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు.
శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం
పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి.
1. నాగావళి నది
ఏ ప్రాంతానికి చెందినది?
నాగావళి నది
‘ఒడిశా’ ప్రాంతానికి చెందినది.
2. నాగావళి నది
ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది?
నాగావళి నది
శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
3. నదుల వలన నునకు
కలిగే ఉపయోగమేంటి?
నదుల వలన మనకు
తాగునీటి, సాగునీటి అవసరాలు తీరుతాయి.
Text Book Page No: 5
ఇ) కిండి లేఖను
చదవండి. ప్రశ్నలు తయారు చేయండి.
1. వాళ్ళ ఊరు
దేనికి దగ్గరగా ఉంటుంది ?
2. ఊరికి దగ్గరగా
ఏ నది ప్రవహిస్తున్నది ?
3. జీవన విధానంలో
ఏది భాగం కావాలి ?
పదజాలం
ఇ) కింది గేయ
వాక్యాలు చదవండి.
ఏదీ కృష్ణ? ఏదీ కృష్ణ ?
– ఏదీ కృష్ణవేణి?
ఇదే కృష్ణ? ఇదే కృష్ణ ?
, ఇదే కృష్ణవేణి?
కృష్ణను కృష్ణవేణి
అని అంటారు. ఇలాగే ‘గోదావరిని గౌతమి’ అని, ‘గంగను భాగిరథి’ అని కూడా అంటారు. వీటిని ఉపయోగించి
మీరు గేయాలు రాయండి.
1. ఏదీ? గౌతమి?
ఏదీ? గౌతమి? . ఏది గోదావరి
?
ఇదే? గౌతమి?
ఇదే? గౌతమి? – ఇదే గోదావరి
?
2. ఏదీ? గంగ? ఏదీ? గంగ? . ఏదీ భాగీరధి ?
ఇదే? గంగ ? ఇదే? గంగ? ఇదే భాగీరధి ?
Text Book Page No: 6
స్వీయరచన
అ) కింది ప్రశ్నలకు
జవాబులు రాయండి.
1. కవి పెన్నా
పూర్వవైభవం గురించి ఏమని ప్రశ్నించాడు ?
ఏది పెన్న? ఏది? పెన్న? – ఏది పినాకిని ?
ఏది నీరు? ఏది హోరు?
– ఏది నీటి జాలు ?
అని కవి పెన్న
పూర్వ వైభవాన్ని ప్రశ్నించాడు.
2. పెన్నా నీటిని
కవి ఎలా వర్ణించాడు ?
కుండపోతలుగా
వర్షం కురిసినా! ఇట్టే పట్టుమని పది రోజులలోనే ఈ ఇసుక సందులలోని బొక్కసాల్లోకి ఇంకి
పోతుంది. నిశ్శబ్దంగా నేల అడుగు పొరల్లో నిద్రిస్తుంది. కానీ ఈ ఏటి నీటిలో కమ్మదనముంటుంది.
దోసిలితో తీసి ఒక్కసారి పుక్కిలిస్తే చాలు పుట్టుకకు సార్థకత ఏర్పడుతుంది. అని కవి
పెన్నను వర్ణించాడు.
3. నదులలో నీళ్ళు
లేకపోతే ఏమౌతుంది?
నదులలో నీళ్ళు
లేకపోతే త్రాగునీరు కష్టమవుతుంది. సాగునీరు కష్టమవుతుంది. త్రాగటానికి నీరు లేకపోతే
మనిషి జీవించడం కష్టమవుతుంది. సాగునీరు లేకపోతే రైతులకు పంటలు పండించడం కష్టమవుతుంది.
పంటలు పండకపోతే మనిషికి తిండి కరువౌతుంది. మనిషి జీవించడం కష్టమవుతుంది. కనుక నదులలోని
నీళ్ళు జీవనాధారం.
సృజనాత్మకత
అ) కింది గోడ
పత్రికను చదవండి.
ఆ) ఇదే విధంగా
నేడు ప్లాస్టిక్ సంచుల వల్ల కాలుష్యం పెరుగుతుంది. దానికి బదులుగా కాగితం, జనపనార సంచుల వినియోగపు
అవసరాన్ని తెలియచేస్తూ గోడ పత్రికను తయారు చేయండి.
జవాబు:
గ్రామ ప్రజలకు
విజ్ఞప్తి
- ప్లాస్టిక్
సంచులు నివారిద్దాం – కాలుష్యాన్ని అరికడదాం
- ప్లాస్టిక్
సంచులు ప్రాణహానికి కారణమవుతున్నాయి.
- వాతావరణ కాలుష్యానికి
కారణమవుతున్నాయి.
- తెలిసి తప్పు
చేస్తున్నాం – భవిష్యతరాలకు ముప్పు తెస్తున్నాం.
- మట్టిలో కలిసిపోయే
కాగితపు సంచులు వాడదాం – కాలుష్యం నివారిద్దాం
- జనపనార సంచులు
ఉపయోగిద్దాం – జగతికి మేలు చేద్దాం
- చేతి సంచులు
వాడదాం – భూమికి చేతనైన సాయం చేద్దాం.
ఇట్లు
గ్రామ పంచాయితీ
కలిగిరి
ప్రశంస
అ) మీ స్నేహితులు
పాఠశాల కుళాయిల్లో నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుతుంటే వారిని మీరు ఎలా ప్రశంసిస్తారు?
జవాబు:
ప్రియమైన నా
మిత్రులందరికీ శుభోదయం నాతో పాటు చదువుతున్న మీ అందరికీ ఈ రోజు నా అభినందనలు. ఎందుకంటే
పాఠశాలలోని కుళాయి నీటిని వృధా చేయకుండా వాడుతున్నారు మీరు. చేతులు కడగటం, పాత్రలు కడగటం
ఇలా త్రాగునీరు వృధా చేయకుండా కేవలం త్రాగటానికి మాత్రం ఉపయోగిస్తున్నారు.
నీరు ప్రాణాధారం
అని మీకు తెలుసు. ఎప్పటికప్పుడు కుళాయి పంపు కట్టి ఉంచుతున్నారు. కనుకనే మన పాఠశాల
ప్రధానధ్యాపకులు మన తరగతిని, నీరు పొదుపుగా – వృధాకాకుండా వాడినందుకు ఉత్తమ తరగతిగా ప్రకటించారు.
అందుకని ఈరోజు మిమ్మల్నందరినీ నేను ప్రశంసిస్తున్నాను. మీ అందరికీ నా అభినందనలు.
నీటిని వృధా
కానికండి – నీరు ప్రాణధారం
భాషాంశాలు
అ) కింది వాక్యాలు
చదవండి. గీత గీసిన పదాలు గమనించండి.
ఆ) ఇంతవరకు
మీరు చదివిన పాఠాల ఆధారంగా కింద పట్టికను పూరించండి. వారిలో రాయండి.
భూతకాల పదాలు:
జీవం పోశారు
: వారు కళలకు జీవం పోశారు .
మలచినావు
: మనిషిని మనిషిగా మలచినావు
వర్తమాన కాల
పదాలు:
చేస్తున్నాయి
: రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి.
పారుతున్నాయి.
కొన్ని నీటి పాయలు పారుతున్నాయి.
వేస్తున్నాడు
: సూర్య దానికి తాళం వేస్తున్నాడు.
భవిష్యత్ కాల
పదాలు :
చేస్తారు
. వీటిని ముఖతః పారాయణం చేస్తారు.
ఎగిరిపోతుంది
: కాసే పైతే అదే ఎగిరి పోతుంది లేరా!
ధారణ చేస్తాం
విద్యార్థి
పద్యాన్ని – భావాన్ని పద విభాగంతో చదవటం నేర్చుకుని, భావయుక్తం. గా, అర్థవంతంగా ధారణచేయాలి. అందుకు ఉపాధ్యాయులు సహకరించాలి. అందులో ని నీతిని,
విషయాన్ని వంటపట్టించుకోవాలి.