Type Here to Get Search Results !

5 th Class Telugu Text book solutions :: 7 padya ratnalu (పద్యరత్నాలు )

0

Text Book Page No: 9 

చిత్రం చూడండి.. ఆలోచించి మాట్లాడండి.

1. చిత్రంలో ఏం జరుగుతున్నది? ఎవరెవరు ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు?

చిత్రంలో అష్టావధానం జరుగుతున్నది. మైకు ముందు ఇద్దరు అవధానులున్నారు. వారికి ఎదురుగా కుడి ప్రక్కన నలుగురు, ఎడమ ప్రక్కన నలుగురు (ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు) పృచ్ఛకులు కూర్చుని ఉన్నారు. వారు ఆ ఇద్దరు అవధానులను ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు అవధానులు జవాబులు పద్యాల రూపంలో చమత్కారంగా ఆశు వుగా చెప్తున్నారు.

2. మీకు తెలిసిన ఏవైనా పద్యాలు పాడండి!

ఏదైనా ఒక చక్కని నీతి పద్యం భావయుక్తంగా, రాగయుక్తంగా ఉపాధ్యాయులు ముందుగా పాడి, తరువాత మరొక పద్యం విద్యార్థుల చేత పాడించాలి.

3. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా చూశారా? చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది.

మేము ఇలాంటి కార్యక్రమాలు చూశాము. శతవధానము చూశాము. అందులో – 100 మంది ప్రచ్ఛకులు ఉన్నారు. అవధానిగారు ఆ వందమంది అడిగే ప్రశ్నలకు – ఆశువుగా చమత్కారంగా పద్యరూపంలో సమాధానం చెప్పారు. చాలా ఆశ్చర్యం కలిగింది. అన్ని ప్రశ్నలు – పద్యాల రూపంలో ఎలా గుర్తు పెట్టుకున్నారా! అని ముక్కు మీద వేలు వేసుకున్నాం. అవధాని గారి ధారణ శక్తి చాలా గొప్పదని అందరూ పొగుడుతుంటే ఔననిపించింది.

  ఈ అవధానం అనేది కేవలం మన తెలుగులో మాత్రమే కలదని, మరే భాషలోను ఈ అవధానం లేదని, అవధానిగారి ప్రక్కన ఉన్న సంచాలకులు చెప్పగానే ఎంతో ఆనందం కలిగింది. నేను కూడా ఈ అవధానం ఎలాగైనా నేర్చుకొని అందులో పాల్గోవాలపించింది. వారితో కలిసి ఒక్క పద్యమైనా పాడాలనిపించింది.

 

Text Book Page No: 12

ఇవి చేయండి


వినడం – ఆలోచించి మాట్లాడటం

1. పద్యాలను రాగయుక్తంగా పాడండి.

ఈ పద్యరత్నాలు’ అనే పాఠంలోని పద్యాలను విద్యార్ధులచే చక్కగా భావయుక్తంగా, రాగయుక్తంగా పాడించాలి. ముందుగా ఉపాధ్యాయులు ఆచరించి, అటు పై విద్యార్ధులచే ఆచరింప చేయాలి.


2. మీకు తెలిసిన కొన్ని నీతి పద్యాలు చెప్పండి!

అ) సదౌష్టియె సిరియెసగును

సదౌష్టియె కీర్తి పెంచు, సంతుష్టిని, నా

సదౌష్టియె ఒన గూర్చును

సదౌష్టియె పాపములను చరచు కుమారా!


భావం :

మంచివారితో మాట్లాడడం వల్ల, స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. పేరు ప్రతిష్ఠలు వస్తాయి. సంతృప్తి కలుగుతుంది. పాపాలు కూడా తొలగిపోతాయి.

 

ఆ)  ఇనుడు వెలుగు నిచ్చు ఘనుఁడు వర్షము నిచ్చు,

     గాలి వీచు చెట్లు పూలు పూచు

    సాధు పుంగవులకు సహజ లక్షణమిది

    లలిత సుగుణ జాల! తెలుగు బాల!

 

భావం :

సూర్యుడు వెలుగు నిస్తాడు. మేఘాలు వర్షాన్ని ఇస్తాయి. గాలి వీస్తుంది. చెట్లు పూలు పూస్తాయి. గొప్పవారికి ఇలాంటి లక్షణాలు సహజంగా ఉంటాయి.

 

3. చదువు లేకపోతే ఏమవుతుంది ?

చదువు లేకపోతే – ఏది మంచి? ఏది చెడు తెలుసుకోగలిగే వివేకం ఉండదు. సంస్కారం కోల్పోతాం. మాట్లాడే విధానం, పని సాధించే తీరు తెలుసుకోలేము. ఎదుగుదల, అభివృద్ధి సజావుగా సాగదు. ఎప్పటికీ ప్రతి విషయంలో ఇంకొకరి మీద ఆధారపడాల్సి ఉంటుంది. కనుక అందరం చక్కగా చదువుకోవాలి.

 

Text Book Page No: 13

చదవడం – వ్యక్తి పరచడం

అ) కింది భావాలకు సరియైన పద్య పాదాలు రాయండి.

1. మేఘం నీటితో నిండి ఉన్నప్పుడే వర్షిస్తుంది.

నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘడు (9వ పద్యం)

2. మేలు చేసి పొమ్మ నుటే పెద్ద శిక్ష.

పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు (3వ పద్యం)

3. విద్యకు పునాది నీతి.

నీతియె మూలము విద్యకు (7వ పద్యం)

4. సత్యం పాపాలు తొలగిస్తుంది.

సత్యమొకటి పాప సంహారమును జేయు (5వ పద్యం)

5. ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనకు విలువ పెరుగుతుంది.

ప్రశ్నతోడ పెరుగు ప్రాభవమ్ము (2వ పద్యం)

 

ఆ) కింది పేరా చదివి ఖాళీలు పూరించండి.

1. స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ముత్తకం అంటారు.

2. ముక్తక రచనకు ఉదాహరణగా శతక , చాటు పద్యాలు చెప్పవచ్చు.

3. తెనాలి రామకృష్ణుడు చాటు పద్యరచనలో ప్రసిద్ధుడు.

4. శతకంలో ముక్తక లక్షణం ఉంటుంది.

 

Text Book Page No: 14

పదజాలం

 

అ) కింది పదాలకు అర్థాలు రాయండి.

1.  కీడు = అపాయం, నష్టం

2. పథం= మార్గం, దారి

3. ప్రాభవం= ప్రభావం, ప్రభలమైన శక్తి/ప్రతాపం

4. నింగి= ఆకాశం

5. తరువు= చెట్టు

6. పెన్నిధి= ధనం, సంపద, నిధి

7. అప్రియం= ఇష్టం లేని పని, అసహ్యమైనది

8. వాక్కు = మాట, ఉపదేశం

 

) ఎవరెవరు ఏమి రాశారో జతపరచండి.

 

1. వేమన శతకం        ( ఇ )  అ) బద్దెన

2. సుమతీ శతకం        ( అ )  ఆ) ఏనుగు లక్ష్మణ కవి

3. మహాభారతం        ( ఉ)   ఇ) వేమన

4. సుభాషిత రత్నాలు    (ఆ )   ఈ) వీర బ్రహ్మేంద్రస్వామి

5. కాళికాంబ శతకం    ( ఈ)   ఉ) తిక్కన

 

(ఇ) కింది పదాలకు బహువచనాలు రాయండి.

1. పద్యం - పద్యాలు

2. నేరం - నేరాలు

3. శత్రువు - శత్రువులు

4. కవి - కవులు

5. ప్రశ్నప్రశ్నలు

6. బుధుడు - బుధులు

7. తరువు - తరువులు

8. ఫలము - ఫలములు


స్వీయరచన

1. మనం ప్రశ్నలు ఎందుకు వేస్తాం?

జ్ఞానం పెంచుకోవడానికి – అసలు విషయం తెలుసుకుని విలువలు పెంచుకోవడానికి, ప్రగతి సాధించడానికి ప్రశ్నలు వేస్తాం.

2. ఒక గ్రామంలో ఎవరెవరు ఉండడం అవసరమని పద్యంలో చెప్పారు?

అవసరానికి అప్పిచ్చేవాడు, వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే బ్రాహ్మణుడు (పండితుడు) మొదలైనవారు గ్రామంలో ఉండడం అవసరమని పద్యంలో చెప్పారు.

3. ఉపకారం చేసేవారికి ఎలాంటి సహజగుణాలు ఉంటాయి?

కోరకుండానే చెట్లు పండ్లనిస్తాయి. మేఘాలు అమృతం వంటి వర్షాన్నిస్తున్నాయి. నిండైన సంపదలచేత పండితులు ఆహంకారం పొందకుండా జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఈ విధమైన సహజ లక్షణాలుంటాయి.

4. శత్రువు విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి ?

చంపదగిన శత్రువు చేతికి చిక్కినా – కీడు చేయకుండా ఏదేనా ఉపకారం చేసి పంపాలి. శత్రువు విషయంలో ఇదే మనం విధించే నిజమైన శిక్ష.

 

సృజనాత్మకత

 

1. నీకు తెలిసిన పద్యభావం ఆధారంగా చిన్న కధను రాయండి.

చంపదగినయట్టి శత్రువు తనచేత

జిక్కినేని గీడు సేయరాదు

పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు

విశ్వదాభిరామ వినురవేమ.

భావం :

ఓ వేమా! చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష.

 

పై భావానికి కథ :

    రామాపురం అనే గ్రామంలో కాముడు, సోముడు, అనే ఇద్దరు మిత్రులు కలిసి వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపారం చక్కగా లాభాలతో సాగుతోంది. వచ్చిన లాభాలు ఇద్దరు సమంగా పంచుకునేవారు. ఒకసారి సోముడు తన కుటుంబంతో కలసి తీర్థయాత్రలకు వెళ్తూ…. తన దగ్గరున్న నగలు, ధనము, విలువైన వస్తువులు కాముడికిచ్చి “ఇవి నీ దగెరుంచుయాత్రనుండి తిరిగి వచ్చాక తీసుకుంటాను. గ్రామంలో దొంగల భయం ఉంది కదా!” అందుకని చెప్పి యాత్రకు వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచాయి.

    సోముడు తిరిగి వచ్చి మిత్రుడు కాముడుని కలసి తన సొమ్మును ఇవ్వమని కోరాడు. ఆ మాటలకు కాముడు కంటినీరు కారుస్తూ…సొమ్మును దొంగలెత్తికెళ్ళారని – నీ ధనంతో పాటు నావికూడా పోయినాయని అబద్దం అడాడు. ఆ మాటలు నమ్మి సోముడు బాధతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకు నిజంగా దొంగలు పడి కాముడి ఇల్లు మొత్తం దోచుకెళ్ళారు. తను చేసిన తప్పు తెలిసి కన్నీరు పెడుతూ సోముడిని కలిసి గోడు వెళ్ళబోసాడు.

     మిత్రుడి బాధ చూడలేక సోముడు తన దగ్గరున్న కొంత ధనం చేతికిచ్చి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టి, నేను నీకు తోడుంటాను. అని ధైర్యం చెప్పి పంపాడు. కాముడిలో పశ్చాత్తాపం మొదలైంది. మిత్రుడి మనసు ఎంత గొప్పదో తెలుసుకుని తనకు తానే సిగ్గుపడ్డాడు.

 

ప్రశంస

మీ తరగతి గదిలో ఎవరు బాగా పద్యాలు పాడతారు? వారిని నీవు ఎలా ప్రశంసిస్తావు?

    మా తరగతి గదిలో అందరూ తెలుగు చక్కగా చదువుతారు. అందులోను తెలుగు పద్యాలు చక్కగా చదువుతారు. పాడతారు. మా గురువుగారు మాకు అలా నేర్పించారు. ఐతే మా అందరిలో సౌమ్య మరీ చక్కగా, రాగయుక్తంగా, అందంగా వినసొంపుగా చదువుతుంది.

    సౌమ్య పద్యం పాడుతుంటే, తరగతి గది చీమచిటుక్కు మనకుండా, నిశ్శబ్దంగా ఉంటుంది. వింటుంది, మేమందరం చెవులు రిక్కించి’ మరీ వింటాము. ప్రతి ఒక్కరం సౌమ్యలా పద్యం పాడాలని ప్రతిరోజు నేర్చుకుంటాం. ఎక్కడెక్కడా ఆపుతుంది – ఎక్కడెక్కడ పదవిభాగం చెస్తోంది. ఎక్కడ దీర్ఘాలు తీస్తోంది, ఎక్కడ కుదిస్తోంది. బాగా పరిశీలించమని మా తెలుగు గురువులు మాతో చెప్పారు.

    సౌమ్య పద్యం పాడాక మాకు చలా ఆనందంగా ఉంటుంది. క్రిందటి సంవత్సరం నవంబరు 14 సందర్భంగా జిల్లా స్థాయిలో పద్యగాన పోటీలలో ఆమెకే ప్రధమ బహుమతి లభించింది. మేము కూడా చాలా ఆనందించాము. త్వరలో మేము కూడా అదే విధంగా పద్యగానం చేస్తాము.

 

Text Book Page No: 15

భాషాంశాలు

 

(ఆ) కింది పురుషవాచక పదాలకు స్త్రీ వాచక పదాలు రాయండి.

1. ఉపాధ్యాయుడు : ఉదా: ఉపాధ్యాయిని/ఉపాధ్యాయురాలు

2. నటుడు = నటి

3. గాయకుడు = గాయని/ గాయకీ

4. కళాకారుడు = కళాకారిణి

5. సైనికుడు = సైనికి/ సైనికురాలు

 

ధారణ చేద్దాం

విద్యార్థి పద్యాన్ని – భావాన్ని పద విభాగంతో చదవటం నేర్చుకుని, భావయుక్తంగా, అర్థవంతంగా ధారణ చేయాలి. అందుకు ఉపాధ్యాయులు సహకరించాలి. అందులోని నీతిని, విషయాన్ని వంటపట్టించుకోవాలి.

 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages