నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు
దీనులందు దేవదేవుడుండు
మానవార్చనంబె మాధవార్చనమురా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: నిజమైన భగవద్భక్తి అంటే
మానవసేవ. మానవులు చేసే ఆరాధనే మాధవుని ఆరాధనతో సమానమని చెప్పడం ద్వారా మానవుల పట్ల
ప్రేమను,
సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.