తగిలినంత మేర దహియించుకొని పోవు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచి వాని మైత్రి మలయమారుత వీచి
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: చెడ్డ వ్యక్తి స్నేహం అగ్నికి నిప్పు వేసినట్లు, మరింత కష్టం కలిగిస్తుందని, మంచివారి స్నేహం మలయమారుతంలా శాంతిని ప్రసాదిస్తుంది అని తెలిపే పద్యం. మన జీవితం మనం ఎవరితో స్నేహం చేస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది.
.