విరుల జేరి హరుని శిరసు నెక్కిన
చీమ
చందమామతోడ సరసమాడె
ఉత్తమాశ్రయమున నున్నతస్థితి గల్గు
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: తక్కువ స్థాయిలో ఉన్నవారు
కూడా ఉన్నతంగా ఎదగవచ్చు. చీమలు హరుని శిరస్సుపై ఉండగలిగినట్లుగా మంచి ఆశ్రయం ఉంటే
సాధారణ వ్యక్తి కూడా ఉన్నత స్థితిలో నిలుస్తాడని చెబుతోంది.