Type Here to Get Search Results !

Class 4 WB Answers 6. ముగ్గుల్లో సంక్రాంతి

0

6. ముగ్గుల్లో సంక్రాంతి

 

WB Page No : 2 :: సాధన పత్రం : 1

చదవడం వ్యక్తపరచడం

(అ) పాఠంలోని సరళపదాలు రాయండి.

1. జరుగుతుంది          2. ఉంది.

3. అంది                       4. కద

5. కలశం                     6. చూడటానికి

7. అడిగింది                 8. పాట

9. పద                          10. సందడి

 

(ఆ) ఈ పాఠంలోని గుణింతపదాలు గుర్తించి, రాయండి.

1. అనూష                    2. పోటీలు

3. చూడడానికి             4. అడిగింది

5. పాట                        6. చాలా

7. రంగుల                    8. వెతుకుతు

9. ముందుకు

 

(ఇ) పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి.

1.తమ్ముడూ                 2. అత్తమ్మ

3. ముగ్గుల                   4. అన్నాడు

5. గొబ్బిళ్ళో                  6. అత్తమ్మ

7. అబ్బా                       8. పెద్ద

9. ఎద్దు

 

(ఈ) పాఠంలోని సంయుక్తాక్షర పదాలను వెతికి రాయండి.

1. ఆదిత్య                     2. వేస్తూంది

3. వెళ్లాం                      4. వస్తావా!

5. ముత్యాలు                6. వినిపిస్తోంది

7. పద్మాల                     8. కన్పించింది

9. పూర్ణకలశం

 

WB Page No : 3   :: సాధన పత్రం : 2


(అ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఏయే సందర్భాలలో ఇంటి ముంగిట రంగుల ముగ్గులు వేస్తారు?

Ans: పండుగ రోజులలో, కొత్త సంవత్సరం రాకకు స్వాగతం, శుభకార్యాలప్పుడు.

2. ముగ్గుల పోటీలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు?

Ans: సంక్రాంతి పండుగ సందర్భంగా , కొత్త సంవత్సర ప్రారంభం సందర్భంగా, పిల్లలకు జరిగే పోటీలలో నిర్వహిస్తారు.

 

(ఆ) కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

పోటీలు జరుగుతున్న చోట చాలా సందడిగా ఉంది. ముత్యాల ముగ్గులు, రంగుల ముగ్గులు... పెద్ద పెద్ద ముగ్గులు ఎంత బావున్నాయో... అత్తమ్మను వెతుకుతూ అనూష, ఆదిత్య ముందుకు వెళ్తున్నారు. నెమళ్ళ ముగ్గు, చిలకల ముగ్గు, పద్మాల ముగ్గు, సీతాకోకచిలుకల ముగ్గు... ఏ ముగ్గు చూసినా దీనికే బహుమతి వస్తుంది అనిపిస్తోంది. ఇంతలో అత్తమ్మ కనిపించింది.

 

1. పై పేరాలో ఏ పోటీల గురించి చెప్తున్నారు?

Ans: సంక్రాంతి ముగ్గుల గురించి చెప్తున్నారు.

2. అనూష, ఆదిత్య ఏయే ముగ్గులు చూశారు?

Ans: ముత్యాల ముగ్గులు, రంగుల ముగ్గులు, నెమళ్ళ ముగ్గు, చిలకల ముగ్గు, పద్మాల ముగ్గు, సీతాకోక చిలుక ముగ్గులు చూసారు.

3. పై పేరాకు శీర్షిక రాయండి.

Ans: ‘రంగవల్లులు' (లేదా) సంబరాలు

 

(ఇ) కింది పేరా చదివి ఖాళీలు పూరించండి.

మనకు ఆహారాన్ని అందించే పశువులను కనుమ పండుగనాడు పూజిస్తారు. బంధువులు, పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు. అంతా కలిసి విందు భోజనాలు చేస్తారు. జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు, కూరగాయలు, డబ్బులు మొదలైనవి గ్రామస్థులు బహూకరిస్తారు.

 

1. కనుమ పండుగ నాడు పశువులకు లకు పూజచేస్తారు.

2. జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు మొదలైనవి బహూకరిస్తారు.

3. పండుగకు బంధువులు పెళ్ళయిన ఆడపిల్లలు అందరూ వస్తారు.

 

WB Page No : 4   :: సాధన పత్రం : 3


(అ) కింది పేరా ఆధారంగా తప్పు(×), ఒప్పు()లను గుర్తించండి.

తెల్లవారుజామున వీథుల్లో వేసే భోగిమంట, సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చే జానపద కళారూపమైన గంగిరెద్దులు, పిల్లలు సందడిగా ఎగురవేసే గాలిపటాలు నా ముగ్గులో చూపించాను". అంది అత్తమ్మ

నేను భోగిమంటలో వేయడానికి నెలరోజుల నుండి ఆవుపేడ పిడకలు ఎండబెట్టి, దండ గుచ్చి ఉంచాను" అంది అనూష.

పాత కర్రసామాను, ఎండుకట్టెలు, అన్నీ చేర్చి భోగి పండుగ రోజు భోగిమంట వేస్తారు. పిడకల దండలు కూడా వేస్తారు”

 

1. భోగిమంట ఉదయం పూట వేస్తారు. (  x   )

2. జానపద కళారూపాల్లో ఒకటి గంగిరెద్దులు. (    )

3. గాలిపటం ఎగురవేయడమంటే పిల్లలకు సరదా. (    )

4. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులతో భోగిమంట వేస్తారు. (  x )

5. అనూష పిడకల దండ గుచ్చింది. (    )

 

(ఆ) కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

సంక్రాంతికి కొన్ని ప్రాంతాలలో కోడిపందాలు, పొట్టేళ్ళ పందాలు, ఎడ్లబండి పరుగు, గుర్రపు స్వారీ, సంగిడిరాళ్ళు ఎత్తడం, కుస్తీ పోటీలు, కబడ్డీ, వాలీబాల్ పోటీలు మొదలైనవి నిర్వహిస్తారు. బొమ్మల కొలువులు పెడతారు.

1. పై పోటీలలో ఒక్కొక్కరుగా పాల్గొనే ఆటల పోటీలు

Ans: కుస్తీపోటీ, కోడిపందాలు, పొట్టేళ్ళ పందాలు, సంగిడిరాళ్ళు ఎత్తడం

2. జట్లలో ఆడే ఆటలు

Ans: కబడ్డీ, వాలీబాల్, ఎడ్లబండి పోటీలు, ఖోఖో , క్రికెట్

3. జంతువులతో నిర్వహించే పోటీలు

Ans: కోడిపందాలు, పొట్టేళ్ళ పందాలు, ఎడ్లబండి పరుగు, గుర్రపుస్వారీ.

 

WB Page No : 5   :: సాధన పత్రం : 4


పదజాలం


(అ) కింది ముగ్గులో ఉన్న అక్షరాలతో పదాలు తయారుచేయండి. వాటి అర్థాలు రాయండి.

ఉదా || 1. పద్మము = తామర పూవు

2.   ధనుస్సు =  విల్లు

3. రాశి = నక్షత్రాల గుంపు

4. శిల = రాయి

5. విశిష్టత = గొప్పతనం

6. సంబరం = సంతోషం

(ఆ) కింది ఖాళీలను సరైన వచనాలతో పూరించండి.

ఏకవచనం

బహువచనం

ఏకవచనం

బహువచనం

ముగ్గు

ముగ్గులు

రత్నం

రత్నాలు

పద్మం

పద్మాలు

గుడి

గుళ్ళు

శంఖం

శంఖాలు

రొట్టె

రొట్టెలు

కొడవలి

కొడవళ్లు

గొర్రె

గొర్రెలు

బడి

బళ్ళు

ఊరు

ఊళ్ళు

బండి

బండ్లు

రాయి

రాళ్లు

పండు

పండ్లు

బుట్ట

బుట్టలు

 

WB Page No : 6   :: సాధన పత్రం : 5


(అ) తెలుగు నెలల పేర్లు రాయండి.

చైత్రము, వైశాఖము, జేష్టము, ఆషాడము, శ్రావణం, బాధ్రపదము, ఆశ్వీజము, కార్తీకం, మార్గశిరము, పుష్యం, మాఘం, ఫాల్గుణం.

 

(ఆ) కింది పిండివంటలను వాటిని తయారు చేసే పదార్థాలలో జతపరచండి.

1. లడ్డు - సెనగపిండి, పంచదార, నూనె

2. అరిసె - బియ్యప్పిండి, బెల్లం, నువ్వులు, నూనె

3. గారె - మినప్పిండి, నూనె

4. పూర్ణం బూరె - సెనగపప్పు, పంచదార/బెల్లం

5. అప్పడం - మినపప్పు, బియ్యప్పిండి.

6. జంతిక - సెనగపిండి, నూనె

 

(ఇ) కింది వాక్యాలను సరిచేసి రాయండి.

1. ముగ్గు చూడు ఈ అత్తమ్మా!

- అత్తమ్మా! ఈ ముగ్గు చూడు

2. ఇది ముగ్గు తెలిపే స్త్రీ శక్తిని.

 స్త్రీ శక్తి ని తెలిపే ముగ్గు ఇది.

3. సందేశాలు ముగ్గులు ఇవి ఇచ్చే.

- సందేశాలు ఇచ్చే ముగ్గులు ఇవి.

4. జాతీయ ముగ్గులో చూడండి జెండా.

- ముగ్గులో జాతీయ జెండాను చూడండి.

5. కూడా ముగ్గు వేశారు చంద్రయాన్.

- చంద్రయాన్ ముగ్గు కూడా కూడా వేశారు.

 

WB Page No : 7   :: సాధన పత్రం : 6

 

అ) ఏదైనా ఒక పిండివంట తయారుచేసే విధానం రాయండి.

 పప్పు చెక్క (లేదా) పప్పు ఉండ తయారు చేసే విదానం:- మొదటిగా వేరుశనగ గుళ్ళు నన్నని సెగమీద దోరగా వేయించాలి. వేగిన గుళ్ళను చల్లారాక - పొట్టు తీయాలి. పొట్టు మొత్తం ఊదేశాక ఆ వేరుశనగ గుళ్ళును సిద్దంగా ఉంచుకొని - అప్పుడు చక్కని చెక్క బెల్లం మ్కులు చేసి పాకం పట్టాలి. పాకం చక్కగా ఉండ పాకం వచ్చేలా తిప్పుతూ శ్రద్ధగా చూస్తూ ఉండాలి. అలా ఉండపాకం రాగానే, అందులో కాస్త యాలకుపొడి వేయించిన గుళ్ళు పోసి బాగా కలేపెట్టి, నేయి రాసిన పళ్ళంలో పోయాలి. అరేక పప్పు చెక్క, ఉండకడితే పప్పు ఉండ.

 

ఆ) మీకు తెలిసిన మరొక 5 పండుగల పేర్లు వాటి విశిష్టత రాయండి.

1 క్రిస్మస్ : చర్చికి వెళ్ళి ప్రార్ధనలు చేస్తారు.

2. దీపావళి : దీపాలు వెలిగించి లక్ష్మీ పూజ చేసి లోక క్షేమం కోరుకుంటారు.

3. ఆగష్టు 15 : గత వీరులను గుర్తుచేసుకుంటూ జెండా వందనం చేస్తారు.

4. సంక్రాంతి : పాడి పంటలు కళకళలాడుతూ దేశం బాగుండాలని పూజలు చేస్తారు.

5. ఉగాది : కొత్త సంవత్సరం క్షేమంగా ఉండాలని ఉగాది పచ్చడి తిని పంచాగ శ్రవణం చేస్తారు.

 

ఇ) ఉత్తరాయణంలో ఉండే తెలుగు నెలలేవి? దక్షిణాయనంలో ఉండే తెలుగు నెలలేవి?

ఉత్తరాయణం : పుష్యమాసం(సగం) మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జేష్ఠం, ఆషాడం (సగం)

దక్షిణాయణం : ఆషాఢం(సగం), శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం(సగం)

 

WB Page No : 8   :: సాధన పత్రం : 7

 

(అ) ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. సంక్రాంతి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు?

Ans: సంక్రాంతి పండుగను సాధారణంగా మూడు రోజుల పాటు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఒక్కో రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది:

మొదటి రోజు - భోగి , రెండవ రోజు - మకర., మూడవ రోజు - కనుమ

 

2. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో కనిపించే జానపద కళారూపాలు ఏవి?

Ans: .పల్లెటూళ్లలో ఈ పండుగ సమయంలో ప్రధానంగా కనిపించే జానపద కళారూపాలు  హరిదాసులు , గంగిరెద్దుల విన్యాసాలు , బుడబుక్కల వారు,  పిట్టల దొరలు , జంగం దేవరలు , కొమ్మదాసరులు & గొబ్బిపాటలు

 

3. భోగి పండుగను ఎలా జరుపుకుంటారు?

జవాబు : తెల్లవారుజామునే ఇంటి ముందు భోగి మంటలు వేయడం, తర్వాత, అందరూ తలారా స్నానం చేస్తారు. కొత్త బట్టలు ధరించి పండుగను ప్రారంభిస్తారు. భోగి రోజు సాయంత్రం ఇంట్లో ఉన్న చిన్న పిల్లల తల మీద నుండి భోగి పళ్లు పోస్తారు.

 

4. ధనుర్మాసంలో మీ గ్రామంలో ఏయే కార్యక్రమాలు చేస్తారు?

మా గ్రామంలో ధనుర్మాసం నెల రోజులు  ముగ్గుల సందడి ,  హరిదాసుల కీర్తనలు, తిరుప్పావై పఠనం , గంగిరెద్దుల విన్యాసాలు, సాయంత్రం వేళల్లో ఊరి రచ్చబండ వద్ద లేదా గుడి ప్రాంగణంలో భజన బృందాలు చేరి హరినామ సంకీర్తనలు చేస్తారు. ఇది గ్రామంలో ఐకమత్యాన్ని, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది.

 

WB Page No : 9   :: సాధన పత్రం : 8

 

సృజనాత్మకత


(అ) ఈ చుక్కలు కలపండి.

 


భాషాంశాలు

 వాక్యంలో నామవాచకాల రంగు, రుచి, వాసన, ఎత్తు, లోతు, స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారని తెలుసుకదా!

(అ) కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి.

1. అవి చల్లని పాలు,

2. అవి వేడి పాలు

3. అవి కమ్మని పాలు

 

WB Page No : 10   :: సాధన పత్రం : 9

 

(అ) కింది పేరా చదివి విశేషణాలు రాయండి.

రవి వేగంగా పరుగెత్తి పాఠశాలకు వచ్చాడు. పుస్తకాల సంచి మోసికొని వచ్చాడు. అప్పటికే ఎర్రగా ఎండకాస్తోంది. నల్లని బూట్లు తరగతి బయటే విప్పి లోపలికి వెళ్ళాడు. నల్లబల్లపై తెల్ల సుద్దముక్కతో గుండ్రంగా తన పేరు రాసాడు.

ఉదా||  నల్లనిబూట్లు

1. నల్లనిబూట్లు

2. వేగంగా

3. ఎర్రగా

4. తెల్ల సుద్దముక్క

5. గుండ్రంగా

 

(ఆ) సివిల్ డ్రస్ రోజున మీ మిత్రులు ఏ రంగు దుస్తులు ధరించారో రాయండి.

మిత్రుని పేరు- రంగు

1.  మస్తాన్  - నలుపు రంగు

2. కమాక్షయ్య – నీలం రంగు

3. దామిని – పింక్ రంగు

4. మధు ప్రియ - తెలుపు

5. లక్షిత్ – నారింజ రంగు

 

WB Page No : 11   స్పందన పత్రం 3 (5, 6 )


గేయం ఆధారంగా ఈ కింది వాటిని జతపరచి, వాటితో సొంత వాక్యాలు రాయండి.

1. పల్లెటూరి                  నీటిలో పడె          

2. కట్టెలు కొడుతూ       నిత్యంబు

3. సత్యవ్రతంబు            చెట్టుకొట్టి

4. అడవిలో                  జీవించసాగె

5. గొడ్డలి చేజారి           బీదవాడు

 

1. అతనొక పల్లెటూరి బీదవాడు

2. అతను కట్టెలు కొడుతూ జీవనం సాగించెను.

3. అతను సత్యవ్రతంబు నిత్యంబు ఆచరించేవాడు.

4. ఒక రోజు అడవిలో చెట్టు కొట్టే సమయంలో

5. చేతిలో గొడ్డలి చేజారి నీటిలో పడిపోయింది

 

2. పాఠం ఆధారంగా గేయకథను సరైన క్రమం పెట్టండి.

1. అది గూడ నాది కా

    దని వాడు తలత్రిప్పి

    వెంటనే ఆదేవి

   వెండిగొడ్డలి చూప

జ.  వెంటనే ఆదేవి

      వెండిగొడ్డలి చూప

      అది గూడ నాది కా

      దని వాడు తలత్రిప్పే

 

2. తిలకించి యతడనె

    తల చేతులాడించె

    మిరుమిట్లు గొలుపుచు

    మెరిసెడి గొడ్డలి

 

జ. మిరుమిట్లు గొలుపుచు

    మెరిసెడి గొడ్డలి

    తిలకించి యతడనె

    తల చేతులాడించే

 

WB Page No : 12

 

3. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కనుమ పండుగనాడు చేసే కార్యక్రమాలు ఏమిటి?

మనకు ఆహారన్నందించే పశువు కొమ్ములకు చక్కని రంగులు దిద్ది , పూజిస్తారు. నుదట పసుపు బొట్టు పెడతారు. బంధువులు వస్తారు. అందరు కలిసి వండి భోజనాలు చేస్తారు. జానపద కళారూపాలు దర్శిస్తారు. కాళాకారులకి, ధాన్యం, బట్టలు, కూరలు, డబ్బులు, బహూకరిస్తారు.

ఈ విధంగా కనుమ జరుపుకుంటారు.

2. మీ గ్రామంలో ఏయే పండుగలు జరుపుకుంటారు?

ఉగాది, శ్రీం"మనవమి, వినాయకచవితి, దసరా, మహాశివరాత్రి, సంక్రాంతి, దీపావళి క్రిస్మస్, రంజాన్, బక్రీద్, కృష్ణాష్టమి, ధనుర్మాసం, మొదలగునవి. హనుమజ్జయంతి

(అ) కింది వాక్యాలు చదవండి. విశేషణ పదాల కింద గీత గీయండి.

1. ఏనుగు పెద్ద జంతువు.

2. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది.

3. సంగీత చక్కని బొమ్మలు గీచింది.

4. చల్లని ఐస్క్రీం తిన్నాను.

(ఆ) కింది వాక్యాలలో క్రియాపదాలు గుర్తించి రాయండి.

మా నాన్న వస్తాడు                    -           వస్తాడు

మాకేమో తెస్తాడు                      -           తెస్తాడు

మరి గంజి పోస్తాడు                  -           పోస్తాడు

మమ్ము బ్రతికిస్తాడు                   -           బ్రతికిస్తాడు

ఒక చెట్టు కొట్టుతున్నాడు           -           కొట్టుతున్నాడు

గొడ్డలి చేజారింది                      -           చేజారింది

పడ్డది నీటిలోన                         -           పడ్డది


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages