Type Here to Get Search Results !

కమిషనర్ పాఠశాల విద్య సమావేశపు ముఖ్యాంశాలు @ 06.03.2026

0

 కమిషనర్ పాఠశాల విద్య సమావేశపు ముఖ్యాంశాలు 


  • ప్రతి జిల్లాకు పదిమంది చొప్పున సబ్జెక్టు వారీగా proportionate గాStudy Leave కొరకు పర్మిషన్ ఇస్తారు. ఈ ప్రతిపాదనను కమిషనర్ గారికి పున సమీక్ష చేసి ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని దీనిపై నిర్ణయం వచ్చే వారానికి వాయిదా పడింది
  • PS Hm ( SA) వారి యొక్క స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు సీనియార్టీలోనే కొనసాగిస్తారు.
  • ఈనెల 10వ తేదీ లోపు TIS లో మార్పులన్నీ చేసి MEOలకు డిక్లరేషన్ ఇవ్వాలి.
  •  రిటైర్మెంట్ ద్వారా ఖాళీ అయిన PSHM పోస్టులను ఆ ఖాళీ అయిన పోస్టు ఎస్జీటీ నుండి పీఎస్ హెచ్ఎం అయితే పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు కాకుండా స్కూల్ అసిస్టెంట్ నుండి ఏర్పడిన పిఎస్ హెచ్ఎం అయితే దానిపై ఆ పోస్టు అవసరాన్ని బట్టి త్వరలో ఎలా భర్తీచేయాలో నిర్ణయిస్తారు
  •  మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ నిర్వహణపై ఇప్పటికే సెక్రటరీ స్థాయిలో సమావేశం అయిందని దీనిపై విధివిధానాలు త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు.
  •  MTS ఉపాధ్యాయుల జీతాలు నిధి పోర్టల్ పెండింగ్ వలన ఆగిపోయాయని వీటిని సత్వరమే పరిష్కరించడానికి తగు చర్యలు చేపట్టాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
  •  ఈనెల 10వ తేదీ లోపు TIS లో మార్పులని చేసి ఎంఈఓ లకు డిక్లరేషన్ ఇవ్వాలి మరియు చేసిన మార్పులన్నీ ప్రింట్ రూపంలో తీసుకోవాలి. 
  •  ఉపాధ్యాయుల కోర్టు కేసుల ద్వారా నోషనల్ సీనియార్టీ పొందిన సందర్భంలో ఆ నోషనల్ సీనియార్టీ కేవలం పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుంది సర్వీస్ పాయింట్ల కేటాయింపుకు వర్తించదు.
  •  అన్ని జిల్లాలలో సీనియారిటీ జాబితాలో పొరపాట్లు, లోపాలను వెంటనే తెలియజేసిన ఎడల వాటిని పరిశీలిస్తాము.
  •  అన్ని జిల్లాలలో డిస్ప్లేనరీ కేసులు చాలాకాలంగా పెండింగ్లో ఉంచరాదని వీటిపై వెంటనే పరిష్కరించడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు తగు నిర్ణయం తీసుకుంటారని ఏ కేసులను దీర్ఘకాలంగా ఉంచరాదని ఆదేశాలు జారీ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages