ఉద్యోగులు/పెన్షనర్ల మాస్టర్ వివరాలు - పేరు, ఇంటిపేరు, DOB, DOJ, PAN, మొబైల్ నంబర్, GPF, APGLI, PRAN మార్చుకోవాలంటే ఈ విధంగా చేయాలి.
ఉద్యోగి పేరు సవరణకు కావలసిన డాక్యుమెంట్లు:
DDO అటెస్టేషన్‌తో ఈ క్రింది వాటిని జతచేయాలి 👇
1. SR కాపీ జిరాక్స్ - మొదటి పేజీ & పేరు ఎంట్రీ ఉన్న పేజీ
2. SSC మార్కుల జిరాక్స్
3. ఆధార్ జిరాక్స్
4. గెజిట్ కాపీ - పూర్తి పేరు మార్పు అయితే తప్పనిసరి
5. అన్ని డాక్యుమెంట్లలో పేరు ఒకేలా ఉండాలి
ఇతర సవరణలకు:
- DOJ సవరణ: SR కాపీ, జాయినింగ్ లెటర్, జాయినింగ్ రిపోర్ట్ జిరాక్స్
- మొబైల్ నంబర్: వ్యక్తిగత రిప్రజెంటేషన్ + కారణం తెలిపే DDO లెటర్
- GPF/APGLI నంబర్: GPF ఆథరైజేషన్/APGLI బాండ్ + DDO లెటర్
- పెన్షనర్ పేరు/DOB/మొబైల్: PPO ఆథరైజేషన్ కాపీ + వ్యక్తిగత రిప్రజెంటేషన్
పంపాల్సిన చిరునామా:
The Director
Treasuries and Accounts Department
First Floor, Nidhi Bhavan
Mangalagiri
ముఖ్య గమనికలు:
1. DDO కవరింగ్ లెటర్ / ట్రెజరీ ఆఫీసర్ ఫార్వార్డింగ్ లెటర్ తప్పనిసరి
2. లెటర్‌లో CFMS ID, DDO ఆఫీస్ మెయిల్ ID, DDO కాంటాక్ట్ నంబర్, DDO కోడ్ తప్పక పేర్కొనాలి
3. ఫిజికల్ కాపీని పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి
4. పెన్షనర్ల విషయంలో సంబంధిత ట్రెజరీ ఆఫీసర్ ద్వారానే DTAకు పంపాలి
పేరు సవరణ కావాల్సిన మిత్రులు ఈ ప్రక్రియను అనుసరించగలరు.