రాష్ట్రంలో మూడు దశల్లో ఫిన్లాండ్ విధానాలు అమలు: ఎస్పీడీ
❈──────🎀─────❈
🌎రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 29 మంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు పంపుతోందని సమగ్ర శిక్షా అభియాన్ (SSA) ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
🏫 విజయవాడలో శుక్రవారం ఫిన్లాండ్‌కు వెళ్లే ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యాశాఖ, ఎస్‌ఎస్‌ఏ సంయుక్తంగా ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి.
🗣️ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
➊:మొదటి దశ
━━━━━━━━━━━━━━━━━━━━━
✧ఈ నెల 17 వరకు ఫిన్లాండ్‌లోని తుర్కు విశ్వవిద్యాలయంకు చెందిన సాంకేతిక విద్యా నిపుణులు అరి కోస్కి, ప్రాథమిక విద్య ప్రిన్సిపల్ సరి ఇసోక్యుటో సింజోయ్, పూర్వ ప్రాథమిక విద్య విభాగ నిపుణులు సువి పువోలక్కా ఆటలు , పాటలు 🎶 ద్వారా విద్యాబోధనపై అవగాహన కల్పిస్తారు.
➋:రెండో దశ
━━━━━━━━━━━━━━━━━━━━━
✦ఆగస్టు 17 నుంచి 26 వరకు ఉత్తమ ఉపాధ్యాయుల బృందం ఫిన్లాండ్‌లోని తుర్కు మరియు రౌమా నగరాల్లో 8 రోజుల పాటు పర్యటిస్తుంది.
✦అక్కడ అమలులో ఉన్న ప్రాథమిక విద్యా విధానాలను అధ్యయనం చేసి, ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన పొందనుంది.
➌:మూడో దశ
━━━━━━━━━━━━━━━━━━━━━
✧ఫిన్లాండ్ పర్యటన అనంతరం ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో అమలు చేసే ప్రాజెక్టులకు తుర్కు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ఆన్‌లైన్‌లో మార్గదర్శకత్వం అందిస్తారు.
✦ప్రాథమిక విద్యలో నాణ్యత పెంపు లక్ష్యంగా ఫిన్లాండ్ విద్యా విధానాలను రాష్ట్రంలో మూడు దశల్లో అమలు చేయనున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు వెల్లడించారు.