Type Here to Get Search Results !

AP 3rd Class Telugu Workbook Answers – 3. మంచి బాలుడు (2026-27)

0
3. మంచి బాలుడు

సాధనపత్రం 1 - చదవడం – వ్యక్తపరచడం (పేజీ 20)

  • అ) కింది గేయ పాదాలను చదవండి. గేయం ఆధారంగా వాటి తరువాత వచ్చే పాదాలను రాయండి.
    1) చెప్పులు తడిసీ బట్టలు తడిసీ
        జ: చిందె నీళ్లు ఒంటిన చిలకగ

    2) గడగడ వణికీ, తడ బడి తొణికీ
        జ: అడుగులు తడబడుతూ పోతున్నది

    3) వణికే తొణికే ఆ ముసలమ్మకు
        జ: ఎవ్వరు సాయం చేయలేదు

    4) మెదలకు ఎవరి త్రోవనే వారు
        జ: పోవుచునున్నారు, చూస్తున్నారు.
  • ఆ) కింది గేయ పాదాలను సరిచేసి వరుస క్రమంలో రాయండి.
    విడిచి వచ్చినాడామె భవనమున
    ముదుసలి అవ్వను చూచి, జాలిగొని
    కానీ వారిలో ఒక్క బాలుడా
    చేయి పట్టి కొనిపోయాడామెను
    సరిచేసిన వరుస క్రమం:
    1. కానీ వారిలో ఒక్క బాలుడు
    2. ముదుసలి అవ్వను చూచి, జాలిగొని
    3. చేయి పట్టి కొనిపోయాడామెను
    4. విడిచి వచ్చినాడామె భవనమున
  • ఇ) కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
    వేములపాడులో ఇషాంత్ అనే బాలుడు ఉండేవాడు. ఇంటా బయట పిల్లలందరితో చాలా స్నేహంగా మెలిగేవాడు. అతడు సమయపాలన, చదువు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండేవాడు. పెద్దలు, ఉపాధ్యాయులు అంటే ఎనలేని గౌరవం. బడికి సరిగా రాని పిల్లలకు చదువులో సహాయపడేవాడు. ఎప్పుడూ తరగతిలో ముందుండేవాడు.
    1. ఇషాంత్ ఎలాంటివాడు? (  ఈ  )
    అ) అశ్రద్ధ గలవాడు                  ఆ) చెడు అలవాట్లు గలవాడు
    ఇ) బద్ధకం గలవాడు                ఈ) మంచి అలవాట్లు గలవాడు
    జ: ఈ) మంచి అలవాట్లు గలవాడు
    2. ఇషాంత్‌లో నీకు నచ్చిన అంశం ఏమిటి?
    జ: బడికి సరిగా రాని పిల్లలకు చదువులో సహాయం చేయడం.
    3. ఇషాంత్‌కు మంచి అలవాట్లు ఉన్నాయని చదివారు కదా! మీకు ఉన్న మంచి అలవాట్లను రాయండి.
    జ: సమయపాలన పాటించడం, పెద్దలను మరియు ఉపాధ్యాయులను గౌరవించడం.
    4. మీరు ఏయే విషయాలలో సమయపాలన పాటిస్తారో రాయండి.
    జ: బడికి రావడంలో, హోమ్‌వర్క్ చేయడంలో, భోజనం చేయడంలో.
www.meebadi.in
3. మంచి బాలుడు

సాధనపత్రం 2 - చదవడం – వ్యక్తపరచడం (పేజీ 21)

  • అ) గేయం ఆధారంగా పదాలు సరిచేసి గేయ పాదాలు రాయండి.
    1) కట్టాయి కాలువలు వీధుల్లో
        జ: ఉదా : వీధుల్లో కాలువలు కట్టాయి.

    2) పోతున్నారు మెల్లగా జనులు
        జ: జనులు మెల్లగా పోతున్నారు

    3) లెక్కిడుతూ పోతున్నది అడుగులు
        జ: అడుగులు లెక్కిడుతూ పోతున్నది

    4) చేస్తూ వచ్చారేంతో సందడి
        జ: సందడి చేస్తూ వచ్చారంతో

    5) చేసేవారు సాయం ఎవరు?
        జ: ఎవ్వరు సాయం చేసేవారు?
  • ఆ) కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
    వినయ్‌కి పక్షులు, జంతువులు, చెట్లు అంటే చాలా ఇష్టం. వాటిని ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు అనుకోకుండా వీచిన గాలి దుమారానికి చెట్టు పైనుంచి ఉడుత పిల్ల కింద పడింది. వినయ్ దాన్ని జాగ్రత్తగా చెట్టు మీద పెట్టాడు. వినయ్ చేసిన సహాయానికి ప్రేమతో పక్షులు, జంతువులు పండ్లు తెచ్చిచ్చాయి. అందరూ సంతోషపడ్డారు.
    1. చెట్టు పైనుండి ఏమి కింద పడింది? (  ఆ  )
    అ) పిచ్చుక పిల్ల                  ఆ) ఉడుత పిల్ల
    ఇ) కాకి పిల్ల                       ఈ) చిలక పిల్ల
    జ: ఆ) ఉడుత పిల్ల
    2. వినయ్‌కు పక్షులు, జంతువులు అంటే బాగా ఇష్టం కదా! నీకు ఏ జంతువులంటే ఇష్టం? కారణం రాయండి.
    జ: నాకు కుక్క అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది విశ్వాసంగా ఉంటుంది మరియు ఇంటికి కాపలా ఉంటుంది.
    3. వినయ్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు?
    జ: నేను కూడా వినయ్ లాగే కింద పడిన ఉడుత పిల్లకు ఉపశమనం కలిగించి జాగ్రత్తగా చెట్టు మీద పెట్టేవాడిని.
    4. పక్షులు, జంతువులు వినయ్‌కి ఎందుకు పండ్లు ఇచ్చాయని మీరునుకుంటున్నారు?
    జ: వినయ్ పక్షులను, జంతువులను దయతో, ప్రేమతో చూసుకున్నాడు కాబట్టి అతడికి కృతజ్ఞతగా పండ్లు ఇచ్చాయి.
www.meebadi.in
3. మంచి బాలుడు

సాధనపత్రం 3 - పదజాలం (పేజీ 22)

  • పేరాను చదవండి. అభ్యాసాలు చేయండి.
    పిల్లల జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది. చిన్నప్పటినుండే మంచి అలవాట్లు నేర్చుకోవాలి. చదువుతోపాటు, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. పెద్దల ఎడల గౌరవం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అన్నదమ్ముల పట్ల అనురాగం చూపించాలి. గురువు చెప్పిన మాట వినాలి. సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలి. నేటి బాలలే రేపటి పౌరులు.
  • 1) పై పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
    అక్షరాలు:
    పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి:
    లత  |  మంట  |  తపన  |  వలన  |  గడగడ  |  దండ
    సొంత వాక్యం:
    జ: లత పూలదండ తెచ్చింది.
  • 2) పై పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
    అక్షరాలు: పి జీ చా లా నే పో గి పె పౌ
    పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి:
    పిలక  |  జీవితం  |  చాప  |  నేతగాడు  |  పోటీ  |  పౌరుడు
    సొంత వాక్యం:
    జ: పాప పాట పాడింది.
  • 3) పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
    అక్షరాలు: ప్ప ద్ధ న్న ల్లి త్త
    పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి:
    గొప్ప  |  శుద్ధ  |  నాన్న  |  పిల్లి  |  అత్త
    సొంత వాక్యం:
    జ: పిల్లి పాలు తాగింది.
  • 4) పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి.
    1. పదం: క్రమశిక్షణ
        సొంత వాక్యం: విద్యార్థికి క్రమశిక్షణ చాలా అవసరం.

    2. పదం: అలవాట్లు
        సొంత వాక్యం: మంచి అలవాట్లు మనకు సమాజంలో పేరు తెస్తాయి.
www.meebadi.in
3. మంచి బాలుడు

సాధనపత్రం 4 - పదజాలం (పేజీ 23)

  • అ) కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు సమానార్థక పదాలు ఉంచి వాక్యాలను తిరిగి రాయండి.
    ఉదా: 1) జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు.
        జ: జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు.

    2) పిల్లలు బడికి వడిగా వెళ్తున్నారు.
        జ: పిల్లలు బడికి వేగంగా వెళ్తున్నారు.

    3) పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది.
        జ: పక్షుల జీవనం ఆనందమయంగా ఉంటుంది.

    4) కష్టపడి పనిచేస్తే విజయం మనదే.
        జ: కష్టపడి పనిచేస్తే గెలుపు మనదే.
  • ఆ) కింది పదాలను జతచేసి, రాయండి.
    • మిలమిల → మెరుపులు
    • కొరకొర → చూపులు
    • మలమల → ఎండలు
    • పకపక → నవ్వులు
    • బిరబిరా → పరుగులు
    • బుడిబుడి → నడకలు
    1. మిలమిల మెరుపులు
    2. కొరకొర చూపులు
    3. మలమల ఎండలు
    4. పకపక నవ్వులు
    5. బిరబిరా పరుగులు
    6. బుడిబుడి నడకలు
  • ఇ) కింది పట్టికలోని అక్షరాలతో పదాలను రాయండి.
    వర్ ర్షం హో ము
    రు
    యం లు గా
    మె పు లి మ్మ
    ఉదా : ఉరుములు
    1. వర్షం
    2. మెరుపులు
    3. ముసలమ్మ
    4. పిల్లి (లేదా సాయం)
www.meebadi.in
3. మంచి బాలుడు

సాధనపత్రం 5 - పదజాలం (పేజీ 24)

  • అ) కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. (  ఆ  )
    బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు.
    అ) జారుతూ                  ఆ) భయపడి
    ఇ) తడుస్తూ                  ఈ) నడుస్తూ
    జ: ఆ) భయపడి
  • ఆ) కింది పదాలను చదవండి. వాటన్నింటి ముందు ఒకే అక్షరాన్ని చేర్చండి. నూతన పదాలు రాయండి.
    1. వి మానం  –  విమానం
    2. వి శేషం  –  విశేషం
    3. వి కలం  –  వికలం
    4. వి కారం  –  వికారం
    5. వి దేశం  –  విదేశం
    6. వి చిత్రం  –  విచిత్రం
    7. వి జ్ఞప్తి  –  విజ్ఞప్తి
    8. వి ఫలం  –  విఫలం
  • ఇ) కింది ఆధారాలతో మంచి అలవాట్లు గురించి నాలుగు వాక్యాలు రాయండి.
    మంచి అలవాట్లు: ( పరిశుభ్రత, వ్యాయామం, క్రమశిక్షణ, గౌరవించటం )
    1. పరిశుభ్రత పాటించడం మంచి అలవాటు.
    2. ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచి అలవాటు.
    3. క్రమశిక్షణ పాటించడం మంచి అలవాటు.
    4. పెద్దలను గౌరవించడం మంచి అలవాటు.
www.meebadi.in
3. మంచి బాలుడు

సాధనపత్రం 6 - స్వీయరచన (పేజీ 25)

  • కింది ప్రశ్నలకు సొంతమాటల్లో జవాబులు రాయండి.
    1. నేలంతా బురదగా ఎందుకు మారింది?
    జ: జోరున కురిసిన వర్షానికి నేలంతా బురదగా మారింది.
    2. గేయ కథలో బాలుడు స్నేహితులకు అమ్మ గురించి ఏమని చెప్పాడు?
    జ: "ఆ ముసలమ్మ కూడా ఒకరికి అమ్మే కదా! మా అమ్మ కూడా ముసలమ్మ అయినప్పుడు నేను దగ్గర లేకపోతే ఎవరో ఒకరు దయతో సాయం చేస్తారు కదా" అని బాలుడు అన్నాడు.
    3. మంచి బాలుడు కథలోని నీతిని రెండు వాక్యాలలో రాయండి.
    జ:
    1. ఇతరులకు సహాయం చేయడం మంచి లక్షణం.
    2. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం మన బాధ్యత.
    4. వర్షం వచ్చినప్పుడు మీరు ఏయే పనులు చేస్తారు?
    జ:
    1. వర్షం వచ్చినప్పుడు కాగితపు పడవలు చేసి నీటిలో వదులుతాను.
    2. వర్షంలో ఆడుకుంటాను, వర్షపు దృశ్యాలను చూసి ఆనందిస్తాను.
    5. బాలుడు ముసలమ్మకు ఎలా సహాయం చేశాడో రాయండి.
    జ: వణుకుతున్న ముసలమ్మ దగ్గరకు వెళ్లి, ఆప్యాయంగా చేయి పట్టుకొని ఆమె ఇంటి దగ్గర సురక్షితంగా దిగబెట్టి వచ్చాడు.
    6. మంచి బాలుడు గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
    జ:
    జోరున వర్షం కురుస్తుండగా వీధిలో నడవలేక ఇబ్బంది పడుతున్న ఒక ముసలమ్మకు ఒక బాలుడు సహాయం చేసి, ఆమెను సురక్షితంగా ఇంటి దగ్గర దిగబెట్టాడు. "ఎవరైనా ముసలమ్మకు సాయం చేస్తే, ఎవరైనా తన అమ్మకు కూడా సాయం చేస్తారు" అని తన స్నేహితులకు చెప్పాడు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే గొప్ప గుణాన్ని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.
www.meebadi.in
3. మంచి బాలుడు

సాధనపత్రం 7 - భాషాంశాలు (పేజీ 26)

  • అ) కింది పేరా చదవండి. నామవాచకాలను గుర్తించి పట్టికలో రాయండి.
    అనితకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. పాఠశాల పెరటితోట లాగా ఇంటి పెరటిలో కూడా మొక్కలు పెంచాలని అనుకుంది. ఆమె బజారుకు వెళ్లింది. వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, టమాట, తోటకూర, గోంగూర, పాలకూర విత్తనాలు కొన్నది. వాటిని తెచ్చి నాటింది. మొలచిన చిన్నచిన్న మొక్కలను చూసి సంతోషించింది. పండిన కూరగాయలు, ఆకుకూరలను తన స్నేహితులైన అరుణ, మాలతి, వనజలకు పంచిపెట్టి సంబరపడింది.
    మనుషుల పేర్లు కూరగాయల పేర్లు ఆకుకూరల పేర్లు
    అనిత వంకాయ తోటకూర
    అరుణ బీరకాయ గోంగూర
    మాలతి చిక్కుడుకాయ పాలకూర
    వనజ టమాట
  • ఆ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
    1. కింది వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి. (  ఆ  )
    నాకు చందమామ అంటే ఇష్టం.
    అ) నాకు                  ఆ) చందమామ
    ఇ) అంటే                  ఈ) ఇష్టం
    జ: ఆ) చందమామ
  • ఇ) కింది వాక్యాలను చదవండి. నామవాచకాల కింద గీత గీయండి.
    1) ఉదయ్ తోటకు వెళ్లి పూలు కోసి, శశికి ఇచ్చాడు.
    2) మాధురి కాకినాడ వెళ్లింది.
    3) ఆనంద్ నిన్న బడిలో మామిడి మొక్క నాటాడు.
    4) వాసవి బజారుకి వెళ్లి బంతి కొన్నది.
  • ఈ) ఈ పట్టికలో నామవాచకాలను రాయండి.
    పువ్వుల పేర్లు పండ్ల పేర్లు పక్షుల పేర్లు
    ఉదా: మందారం మామిడిపండు కోకిల
    గులాబీ జామపండు చిలుక
    మల్లెపువ్వు సపోటా నెమలి
    చామంతి అరటిపండు పావురం
www.meebadi.in
3. మంచి బాలుడు

సాధనపత్రం 8 - సృజనాత్మకత (పేజీ 27)

  • అ) ఎగిరే సైకిలుమీద మీ ప్రయాణాన్ని ఊహించి రాయండి.
    వాక్యాలు :
    ఉదా : నేను మేఘాలను తాకుతాను.
    1. నేను ఆకాశంలో పక్షులతో కలసి సరదాగా ఎగురుతాను.
    2. ఎత్తైన భవనాలు, నదులు, కొండలను పైనుంచి చూస్తూ ఆనందిస్తాను.
    3. ఏ ట్రాఫిక్ లేకుండా చాలా వేగంగా బడికి చేరుకుంటాను.
    4. మా ఊరి అందాలను ఆకాశం నుండి చూస్తూ నా మిత్రులకు టాటా చెప్తాను.
  • ఆ) చుక్కలు కలిపి రంగులు వేయండి. చిత్రం గురించి రాయండి.
    1. చిత్రంలో అమ్మ తన చిన్న పాపను ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రేమగా చూస్తోంది.
    2. పాప కూడా ఎంతో సంతోషంగా నవ్వుతూ అమ్మ వంక చూస్తోంది.
    3. అమ్మ ప్రేమ ఎంతో కమ్మనైనది, అపారమైనది.
    4. తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో అమ్మ ఎంతో ఆనందాన్ని పొందుతుంది.
www.meebadi.in
3. మంచి బాలుడు

సాధనపత్రం - నేనేమి నేర్చుకున్నాను? (పేజీ 28)

  • 1. కింది పదాలను చదవండి. వాటి ముందు సరియైన అక్షరాన్ని ఉంచి నూతన పదాలను తయారుచేయండి.
    అక్షరాలు: ( ఆ, ని, అ, కి )
    1. భయం  –  భయం                      3. దానం  –  దానం / నిదానం
    2. రణం  –  రణం / కిరణం                  4. కారం  –  కారం / కారం
  • 2. కింది జంట పదాలను గమనించండి. అలాంటి మరికొన్ని పదాలను రాయండి.
    • సిరిసంపదలు          1. సుఖసంతోషాలు          2. ఇల్లువాకిలి          3. ఆటపాటలు
    • కష్టసుఖాలు              4. కూరగాయలు              5. తిండితిప్పలు          6. లాభనష్టాలు
  • 3. కింది వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి. (  అ  )
    సౌమ్య పూలతోటకు వెళ్లి పూలు కోసింది.
    అ) నామవాచకం                ఆ) సర్వనామం
    ఇ) విశేషణం                     ఈ) క్రియ
    జ: అ) నామవాచకం
  • 4. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
    రంగాపురం అనే ఊరిలో చరణ్ అనే బాలుడు ఉండేవాడు. ఒకరోజు అతడు మైదానంలో ఆడుకుంటుండగా గాయపడిన పక్షి పిల్లనూ చూశాడు. వెంటనే ఆ పక్షి పిల్లనూ ఇంటికి తీసుకువెళ్లాడు. దానికి నీళ్లు, ఆహారం పెట్టి జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని రోజులకు పక్షిపిల్ల కోలుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. చరణ్ చాలా ఆనందపడ్డాడు.
    i. చరణ్ ఎందుకు ఆనందపడ్డాడు?
    జ: గాయపడిన పక్షి పిల్ల తాను చేసిన సేవలతో కోలుకొని ఆకాశంలోకి స్వేచ్ఛగా ఎగిరిపోవడంతో చరణ్ ఆనందపడ్డాడు.
    ii. చరణ్ స్థానంలో నీవుంటే పక్షిపిల్లను ఎలా కాపాడుతావు?
    జ: నేను కూడా పక్షిపిల్లను ఇంటికి తెచ్చి గాయానికి మందు రాసి, నీళ్లు మరియు గింజలు పెట్టి ప్రేమగా కాపాడుతాను.
    iii. మీరు మీ అమ్మమ్మ తాతయ్యలకు ఎలా సహాయపడతారో రాయండి.
    జ: వారు అడిగిన వస్తువులను అందిస్తాను, నడిచేటప్పుడు చేయి పట్టుకొని సహాయం చేస్తాను మరియు వారు చెప్పే మాటలు వింటాను.
  • 5) కింది గేయాన్ని చదవండి. గేయ పాదాలను పొడిగించండి.
    పిల్లలం మేం పిల్లలం..!
    అమ్మానాన్నల ముద్దు బిడ్డలం..!
    పిల్లలం మేం పిల్లలం..!
    ఆడే పాడే పిడుగులం..!
    పిల్లలం మేం పిల్లలం!
    బడికి వెళ్లే బాలలం..!
    దేశం మెచ్చే రత్నాలం..!
    రేపటి పౌరులము మేమంతలం..!
    పిల్లలం మేం పిల్లలం!
www.meebadi.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages