Type Here to Get Search Results !

AP 3rd Class Maths (TM) Textbook Solutions – 4. గుణకారం (2026-27)

0
4 గుణకారం
పండ్ల దుకాణం (పేజీ నెం. 97)
  • 1) దుకాణంలో ఎన్ని ఆపిల్స్ ఉన్నాయి?
    • ఎన్ని వరుసల ఆపిల్ పండ్లు ఉన్నాయి? = 3 వరుసలు
    • ప్రతి వరుసలో ఎన్ని ఆపిల్ పండ్లు ఉన్నాయి? = 6 ఆపిల్ పండ్లు
    • మొత్తం ఆపిల్ పండ్ల సంఖ్య = 3 × 6 = 18 ఆపిల్ పండ్లు
  • 2) ఆపిల్ పండ్ల ధర మామిడి పండ్ల ధరకు ఎన్ని రెట్లు?
    ఆపిల్ ధర (1 కిలో) = ₹ 120, మామిడి ధర (1 కిలో) = ₹ 60
    120 ÷ 60 = 2 రెట్లు
  • 3) మీరు దుకాణంలో రెండు డజన్ల అరటి పండ్లు కొనాలనుకుంటే పండ్లు అమ్మే వ్యక్తికి మీరు ఎంత డబ్బు చెల్లించాలి?
    1 డజన్ అరటిపండ్ల ధర = ₹ 25
    2 డజన్ల అరటిపండ్ల ధర = 2 × 25 = ₹ 50/-
  • 4) 3 కిలోల మామిడి పండ్లు మరియు 1 కిలో ఆపిల్ పండ్లు కొనడానికి, మీరు పండ్లు అమ్మే వ్యక్తికి ఎంత డబ్బు చెల్లించాలి?
    3 కిలోల మామిడి పండ్ల ధర = 3 × 60 = ₹ 180
    1 కిలో ఆపిల్ పండ్ల ధర = ₹ 120
    మొత్తం చెల్లించాల్సిన సొమ్ము = 180 + 120 = ₹ 300/-
గణిత ఆట (పేజీ నెం. 99)
  • ప్రతి కవరు లోపల ఉన్న సంఖ్యా కార్డులను గుర్తించండి:
    • కవరు 1 (లబ్ధం = 18) → కార్డులు: 2 మరియు 9 (లేదా 3 మరియు 6)
    • కవరు 2 (లబ్ధం = 32) → కార్డులు: 4 మరియు 8
    • కవరు 3 (లబ్ధం = 72) → కార్డులు: 8 మరియు 9
    • కవరు 4 (లబ్ధం = 20) → కార్డులు: 2 మరియు 10 (లేదా 4 మరియు 5)
    • కవరు 5 (లబ్ధం = 45) → కార్డులు: 5 మరియు 9
ఇవి చేయండి (పేజీ నెం. 101)
1. కింది వాటిని చేయండి
  • అ) 21 × 3 =
    21 × 3 = 63
  • ఆ) 41 × 5 =
    41 × 5 = 205
  • ఇ) 23 × 4 =
    23 × 4 = 92
  • 21 × 2 = 42 లో:
    • గుణ్యం ఏది? = 21
    • గుణకం ఏది? = 2
    • లబ్ధం ఏది? = 42
రాత లెక్కలు (పేజీ నెం. 103)
  • 2. కార్తీక్ వద్ద మొత్తం 4 ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్ నందు 24 టపాసులు ఉన్నాయి. 4 ప్యాకెట్లలో కలిపి మొత్తం ఎన్ని టపాసులు ఉన్నాయి?
    ఒక్కొక్క ప్యాకెట్లో ఉన్న టపాసులు = 24
    ప్యాకెట్ల సంఖ్య = 4
    మొత్తం టపాసుల సంఖ్య = 24 × 4 = 96 టపాసులు
  • 3. ఒక సంచిలో 12 అరటిపండ్లు ఉన్నాయి. అలాంటి 5 సంచులలో మొత్తం ఎన్ని అరటిపండ్లు ఉంటాయి?
    ఒక్కొక్క సంచిలో ఉన్న అరటిపండ్లు = 12
    సంచుల సంఖ్య = 5
    మొత్తం అరటి పండ్ల సంఖ్య = 12 × 5 = 60 అరటిపండ్లు
  • ఉదాహరణ: ఒక్కొక్క సంచిలో 32 కొబ్బరికాయలు ఉన్నాయి. అలాంటి 4 సంచులలో మొత్తం ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయి?
    ఒక సంచిలో ఉన్న కొబ్బరికాయలు = 32
    సంచుల సంఖ్య = 4
    అన్ని సంచులలో ఉన్న కొబ్బరికాయలు = 32 × 4 = 128 కొబ్బరికాయలు
ఇవి చేయండి (పేజీ నెం. 105)
1. కింది వాటిని చేయండి
  • అ) 86 × 2 =
    86 × 2 = 172
  • ఆ) 45 × 5 =
    45 × 5 = 225
  • ఇ) 64 × 3 =
    64 × 3 = 192
  • ఈ) 58 × 4 =
    58 × 4 = 232
  • 2. ఒక పెట్టెలో 50 పుస్తకాలు ఉన్నాయి. అయిన అలాంటి 4 పెట్టెలలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి?
    ఒక్కొక్క పెట్టెలోని పుస్తకాల సంఖ్య = 50
    మొత్తం పెట్టెలు = 4
    మొత్తం పుస్తకాలు = 50 × 4 = 200 పుస్తకాలు
  • 3. ఒక పెన్సిల్ ధర ₹4. 32 పెన్సిళ్ళ ధర ఎంత?
    ఒక పెన్సిల్ ధర = ₹ 4
    32 పెన్సిళ్ళ ధర = 32 × 4 = ₹ 128/-
ఎక్కాలను తయారుచేయడం (పేజీ నెం. 107)
6 వ ఎక్కాన్ని, 3వ ఎక్కాన్ని కలపటం ద్వారా 9వ ఎక్కాన్ని ఏర్పరచడం
6వ ఎక్కం 3వ ఎక్కం Ans (9వ ఎక్కం)
6 3 9
12 6 18
18 9 27
24 12 36
30 15 45
36 18 54
42 21 63
48 24 72
54 27 81
60 30 90
10 చే గుణకారం (పేజీ నెం. 109)
  • ఈ. 8 ప్యాకెట్లలో ఎన్ని పెన్సిళ్లు ఉంటాయి?
    8 × 10 = 80
  • ఉ. 10 ప్యాకెట్లలో ఎన్ని పెన్సిళ్లు ఉంటాయి?
    10 × 10 = 100
  • ఊ. 14 ప్యాకెట్లలో ఎన్ని పెన్సిళ్లు ఉంటాయి?
    14 × 10 = 140
  • ఋ. 26 ప్యాకెట్లలో ఎన్ని పెన్సిళ్లు ఉంటాయి?
    26 × 10 = 260
  • ఎ. 57 ప్యాకెట్లలో ఎన్ని పెన్సిళ్లు ఉంటాయి?
    57 × 10 = 570
ఇవి చేయండి (పేజీ నెం. 111)
  • 1. 34 × 10 = 340, 10 × 34 = 340
  • 2. 80 × 10 = 800, 10 × 80 = 800
  • 3. 48 × 10 = 480, 10 × 48 = 480
  • 4. 85 × 10 = 850, 10 × 85 = 850
  • 5. 10 × 90 = 900, 90 × 10 = 900
అమరికను పరిశీలించి, గుణకారాలు రాయండి
20 చే గుణకారం 30 చే గుణకారం 40 చే గుణకారం
6 × 20 = 120 6 × 30 = 180 6 × 40 = 240
7 × 20 = 140 7 × 30 = 210 7 × 40 = 280
8 × 20 = 160 8 × 30 = 240 8 × 40 = 320
9 × 20 = 180 9 × 30 = 270 9 × 40 = 360
10 × 20 = 200 10 × 30 = 300 10 × 40 = 400
11 × 20 = 220 11 × 30 = 330 11 × 40 = 440
12 × 20 = 240 12 × 30 = 360 12 × 40 = 480
అభ్యాసం - 1 (పేజీ నెం. 113)
  • 1. గుణ్యం, గుణకం, లబ్ధాలు రాయండి:
    అ) 72 × 4 = 288 లో → గుణ్యం = 72, గుణకం = 4, లబ్ధం = 288
    ఆ) 5 × 100 = 500 లో → గుణ్యం = 5, గుణకం = 100, లబ్ధం = 500
  • 2. లబ్దాన్ని కనుక్కోండి:
    అ) 75 × 2 = 150
    ఆ) 95 × 4 = 380
    ఇ) 70 × 8 = 560
    ఈ) 93 × 9 = 837
    ఉ) 64 × 8 = 512
    ఊ) 96 × 10 = 960
  • 4. కింది వాటిని సాధించండి:
    అ) ఒక పెన్సిల్ ఖరీదు ₹6. అయితే 72 పెన్సిళ్ళ ఖరీదు ఎంత?
    72 × 6 = ₹ 432/-

    ఆ) ఒక పండ్ల తోటలో, ఒక్కొక్క వరుసకు 25 చెట్ల చొప్పున 10 వరుసలలో మామిడి చెట్లు కలవు. ఆ తోటలో ఉన్న మొత్తం మామిడిచెట్లు ఎన్ని?
    25 × 10 = 250 చెట్లు
  • 5. రాజేష్ ఒక దుకాణంలో ఐదు సంచుల నారింజ పండ్లను కొన్నాడు. ప్రతిసంచిలో తొమ్మిది నారింజ పండ్లు ఉన్నాయి. రాజేష్ దగ్గర మొత్తం ఎన్ని నారింజ పండ్లు ఉన్నాయి?
    అ) 2 x 9 = 18 (లేదా) 9 + 9 = 18
    ఆ) 5 x 5 = 25 (లేదా) 5 + 5 + 5 + 5 + 5 = 25
    ఇ) 5 x 9 = 45 (లేదా) 9 + 9 + 9 + 9 + 9 = 45
    ఈ) 9 x 9 = 81 (లేదా) 9 + 9 + ... = 81
    Answer: ఇ) 5 x 9 = 45 (లేదా) 9 + 9 + 9 + 9 + 9 = 45
ఇవి చేయండి (పేజీ నెం. 119)
  • 1. కింది వాటిని చేయండి:
    అ) 71 × 24 = 1704
    ఆ) 45 × 38 = 1710
    ఇ) 95 × 42 = 3990
  • 2. ఒక బస్సులో 48 మంది ప్రయాణించగలరు. అలాంటి 26 బస్సులలో మొత్తం ఎంతమంది ప్రయాణించగలరు?
    48 × 26 = 1248 మంది
  • 3. ఒక గ్రంథాలయంలో 48 కప్‌బోర్డులు కలవు. ఒక కప్‌బోర్డ్ నందు 63 పుస్తకాలు కలవు. ఆ గ్రంథాలయంలో మొత్తం ఎన్ని పుస్తకాలు కలవు?
    48 × 63 = 3024 పుస్తకాలు
ఇవి చేయండి (పేజీ నెం. 121)
  • 1. కింది లెక్కలు చేయండి:
    అ) 122 × 4 = 488
    ఆ) 140 × 2 = 280
    ఇ) 221 × 3 = 663
    ఈ) 111 × 9 = 999
  • 2. ఒక పుస్తకంలో 130 పేజీలు కలవు. 3 పుస్తకాలలో ఉండే మొత్తం పేజీలు ఎన్ని?
    130 × 3 = 390 పేజీలు
  • 3. ఒక సంచి ధర ₹300 అయిన 2 సంచులను కొనాలంటే ఎంత మొత్తం చెల్లించాలి?
    300 × 2 = ₹ 600/-
  • 4. ఒక్కొక్క పెట్టెలో 142 బంతులు గల 2 పెట్టెలు ఉన్నాయి. అయిన మొత్తం బంతుల సంఖ్య ఎంత?
    142 × 2 = 284 బంతులు
అంచనా వేయడం & అభ్యాసం - 2 (పేజీ నెం. 123, 125)
  • 1. ప్రతి బుట్టలో 26 మామిడి పండ్లు ఉంటాయి. అలాంటి 19 బుట్టలలో ఎన్ని మామిడి పండ్లు ఉంటాయి? (అంచనా)
    అంచనా: 26 ≈ 25, 19 ≈ 20 → 25 × 20 = 500 (లేదా 26 × 20 = 520). సరియైన అంచనా = 500
  • 2. ఒక్కో సినిమా టికెట్ ధర ₹25. ఒక తరగతిలోని 28 మంది విద్యార్థులు సినిమా చూడడానికి వెళితే వారు టికెట్ల కోసం ఎంత డబ్బు చెల్లించాలి?
    అంచనా: 25 × 30 = 750 (ఖచ్చితమైనది 25 × 28 = 700). ఎంపికలలో సరియైనది = ₹ 750/-
  • 3. శివ 26 వరుసలలో ఒక్కొక్క వరుసకు 27 మొక్కల చొప్పున ఎన్ని మొక్కలను కొనాలి?
    అంచనా: 26 × 27 = 702. ఎంపికలలో దగ్గరి విలువ = 780 (లేదా 700)
  • 4. ఒక మడత కుర్చీ ధర ₹175. అయిన 5 మడత కుర్చీల ధర ఎంత?
    అంచనా: 175 × 5 = 875. దగ్గరి ఎంపిక = ₹ 1000/-
అభ్యాసం - 2 (పేజీ నెం. 125)
  • 1. గుణించండి:
    ఎ) 12 × 9 = 108
    బి) 42 × 19 = 798
    సి) 414 × 2 = 828
  • 2. ఖాళీలు పూరించండి:
    అ) 67 × 5 = 335
    ఆ) 93 × 4 = 372
    ఇ) 123 × 3 = 369
  • 3. ఒక నెక్లెస్ లో 36 పూసలు ఉన్నాయి. 13 నెక్లెస్ లలో ఎన్ని పూసలు ఉంటాయి?
    36 × 13 = 468 పూసలు
  • 4. ఒక అట్ట పెట్టెలో 48 సీసాలు ఉన్నాయి. 16 అట్టపెట్టెలలో మొత్తం ఎన్ని సీసాలు ఉంటాయి?
    48 × 16 = 768 సీసాలు
  • 5. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షపళ్ళు ఉన్నాయి. 44 పళ్ళాలలో మొత్తం ఎన్ని ద్రాక్షపళ్ళు ఉంటాయి?
    54 × 44 = 2376 ద్రాక్షపళ్ళు
  • 6. ఒక డిక్షనరీ (నిఘంటువు) ఖరీదు ₹120. 4 డిక్షనరీలు కొనడానికి ఎంత డబ్బు చెల్లించాలి?
    120 × 4 = ₹ 480/-
  • 7. ఒక్కొక్క విద్యార్థి ₹110 చొప్పున 5 గురు విద్యార్థులు సేకరించిన మొత్తం డబ్బు ఎంత?
    110 × 5 = ₹ 550/-
  • 8. [    ] × 6 = 30 లో లేని సంఖ్య ఏది?
    అ) 5
    ఆ) 6
    ఇ) 24
    ఈ) 36
    Answer: అ) 5
అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి (పేజీ నెం. 127)
  • 1. 89 × [    ] = 89. ఖాళీలో ఉంచవలసిన సంఖ్య ఏది?
    అ) 0
    ఆ) 1
    ఇ) 89
    ఈ) 90
    Answer: ఆ) 1
  • 2. రమ 5 × 5 = 25 అనే సమస్యను పరిష్కరించింది. జవాబును తనిఖీ చేయడానికి ఏ ప్రక్రియను ఉపయోగించవచ్చు?
    అ) +
    ఆ) -
    ఇ) ×
    ఈ) ÷
    Answer: ఈ) ÷ (25 ÷ 5 = 5)
  • 3. వరుస క్రమం: 16, 32, 64 ... ఈ క్రమంలో తరువాత వచ్చే సంఖ్య ఏదై ఉంటుంది?
    అ) 64 కు 2 కూడుట
    ఆ) 64 ను 2 చే గుణించుట
    ఇ) 64 ను 2 చే భాగించుట
    ఈ) 64 ను 8 తో భాగించుట
    Answer: ఆ) 64 ను 2 చే గుణించుట (64 × 2 = 128)
  • 4. 4 పళ్ళేలలో ఒక్కో పళ్ళెంలో 4 ఆపిల్ పండ్ల ప్రకారం మొత్తం ఎన్ని ఆపిల్ పండ్లు ఉంటాయి? దీని గుణకార రూపం:
    అ) 4 × 4 = 16
    ఆ) 4 + 4 = 16
    ఇ) 4 - 4 = 0
    ఈ) 4 ÷ 4 = 16
    Answer: అ) 4 × 4 = 16
  • 5. కృష్ణకి 19 × 5 = 85 అని, రవికి 19 × 5 = 95 అని సమాధానం వచ్చింది. నీవు ఎవరితో ఏకీభవిస్తావు?
    19 × 5 = 95. కావున నేను రవితో ఏకీభవిస్తాను.
  • 6. 24 × 3 కు ఒక రాత లెక్కను తయారుచేయండి. సాధించండి.
    లెక్క: ఒక తోటలో వరుసకు 24 చెట్ల చొప్పున 3 వరుసలలో చెట్లు కలవు. ఆ తోటలో ఉన్న మొత్తం చెట్ల సంఖ్య ఎంత?
    సాధన: 24 × 3 = 72 చెట్లు
  • 7. రంజని దగ్గర 27 పువ్వులు ఉన్నాయి. ఆమె ఒక్కో పూలకుండీలో 3 పువ్వులు చొప్పున ఉంచాలి. అయిన ఆమెకు ఎన్ని పూలకుండీలు కావాలి?
    27 ÷ 3 = 9 పూలకుండీలు
  • 8. స్నేహ 4 బుట్టలలో ఒక్కో బుట్టలో 15 బంతులు ఉంచింది. మొత్తం బంతుల సంఖ్య ఎంత?
    15 × 4 = 60 బంతులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages