Type Here to Get Search Results !

FAQ-1

0

జవాబు: సిఎల్ మినహా మిగిలిన సెలవులలో ఉన్న సందర్భంలో వేసవి, దసరా, సంక్రాంతి సెలవులలోను పిహెచ్ అలవెన్స్ చెల్లించరు.

జవాబు: అవసరం లేదు. ఆ రెండు రోజులు సెలవు దినాలు. కాబట్టి సంతకం చేయాల్సిన అవసరం లేదు. అయితే పాఠశాలలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలి.

జవాబు: సిసిఎ నిబంధనలలో 9(i) రూల్ ప్రకారం మరియు జీఓ ఎమ్ఎస్ నం.53; తేదీ.04.02.1997 ప్రకారం సెన్సూర్ స్వల్ప దండనగా పరిగణించబడుతుంది. సెన్సూర్ వర్తించిన ఉద్యోగికి ఒక సంవత్సరం కాలం పదోన్నతులకు అర్హత ఉండదు.

జవాబు: చేయవచ్చు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ గరిష్టంగా రెండు లక్షలవరకు చెల్లిస్తారు. జీఓ ఎమ్ఎస్ నం.74 హెల్త్ & మెడికల్, తేదీ.15.03.2005 ప్రకారం డెలివరీ ఖర్చులను కూడా క్లయిమ్ చేయవచ్చు. అయితే మీరు క్లయిమ్ చేసే ఆసుపత్రి రిఫరల్ హాస్పిటల్ అయి ఉండాలి.

జవాబు: ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాతనే వడ్డీ మినహాయింపు వర్తిస్తుంది. అయితే నిర్మాణంలో ఉన్న సమయంలో చెల్లించిన వడ్డీని నిర్మాణం పూర్తి అయిన తదుపరి 5 సం॥లలో వాయిదాల ప్రకారం చూపించుకుని మినహాయింపు పొందవచ్చు.

జవాబు: మీరు ఉన్నతాధికారుల అనుమతితో డిఎస్‌సి పరీక్షకు హాజరైతే మీకు వేతన రక్షణ ఉంటుంది.

జవాబు: పెన్షన్‌లో గరిష్టంగా 40% మాత్రమే కమ్యూటెడ్ చేసుకోవచ్చును. వచ్చే కమ్యూటేషన్ మొత్తంపై సీలింగ్ లేదు.

జవాబు: భార్య ట్యూబెక్టమీ చేయించుకున్నప్పుడు భార్యకు సహాయకుడిగా ఉండేందుకు ఉద్దేశించిన సెలవు, బిడ్డకు సంరక్షణగా ఉండేందుకు ఇచ్చిన పెటర్నిటీ లీవు వేరు వేరు. ట్యూబెక్టమీ ప్రత్యేక సెలవు ఆ సమయంలోనే వాడుకోవాలి. పెటర్నిటీ లీవు ప్రసవం జరిగిన 6 నెలలలోపు వాడుకోవచ్చు. కాబట్టి రెంటింటిని వేరువేరుగా పరిగణిస్తూ, రెంటింటిని వాడుకునే అవకాశం ఉపాధ్యాయునికి కలదు.

జవాబు: ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు Rule 15B(i) ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు మాత్రమే కమ్యూటెడ్ చేయడానికి అవకాశం ఉంది. 240 రోజులకు మించి వాడుకున్న రోజులను అర్ధజీతపు సెలవుగా మార్చి ఆ తేడా అమౌంట్‌ను రికవరీ చేస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages