Type Here to Get Search Results !

స్కూల్ గ్రాంట్ బిల్లుల సమర్పణలో HMs తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు!

0

 స్కూల్ గ్రాంట్ బిల్లుల సమర్పణలో HMs తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు! 


స్కూల్ గ్రాంట్‌కు సంబంధించి మొదట సమర్పించిన బిల్లు రిజెక్ట్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిల్లులు సమర్పించే ముందు క్రింది అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి.


  • 1. బిల్లు మొత్తం – వోచర్ల మొత్తం సరిపోలాలి :  బిల్లులో నమోదు చేసిన మొత్తం, సమర్పించిన అన్ని వోచర్ల మొత్తం ఒకే విధంగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా సరిచూసుకోవాలి.
  • 2. వెండర్ ఎంపిక – తేదీల నమోదు తప్పనిసరి :  బిల్లులో వెండర్‌ను ఎంపిక చేసిన తర్వాత సంబంధిత తేదీలు సక్రమంగా నమోదు చేయాలి. తేదీలు లేకపోతే ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ, పైస్థాయి పరిశీలనలో బిల్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
  • 3. బిల్లు సమర్పణలో HMలదే కీలక బాధ్యత :  మొత్తం బిల్లును MIS సిబ్బందిపై వదిలేయకుండా, ప్రధానోపాధ్యాయులు స్వయంగా బిల్లు వివరాలు, వోచర్లు, మొత్తాలు, తేదీలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
  • 4. తొందరపాటు వద్దు – ఖచ్చితత్వమే ముఖ్యం : పైస్థాయి నుంచి ఒత్తిడి ఉందని హడావుడిగా బిల్లులు సమర్పించవద్దు. ప్రతి వివరాన్ని సరిచూసిన తర్వాతే బిల్లును ఫైనల్ చేయాలి.


📍గుర్తుంచుకోండి:

  •  వోచర్ల మొత్తం = బిల్లు మొత్తం
  •  వెండర్ వివరాలు సక్రమంగా ఉండాలి
  •  అవసరమైన తేదీలను నమోదు చేయాలి
  •  అన్ని వివరాలను పరిశీలించిన తర్వాతే బిల్లు సమర్పించాలి


5000/- అమౌంట్ పాఠశాలలు ఈవిధంగా...

5000 రూపాయలు sanction అవుతున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈవిధంగా ఒక్కో component కి బిల్లులు తయారుచేసుకోవలెను.

Grant: Rs. 5,000
S.No Component (%) Amount (₹)
1. Swachhta Action Plan (10%) 500
2. Maintenance & Repair (40%) 2,000
3. Consumables (25%) 1,250
4. Sports & Play Material (15%) 750
5. Lab, Library & Teaching Aids (10%) 500
Total: Rs. 5,000 5,000

12500/- అమౌంట్ పాఠశాలలు ఈవిధంగా...

Grant: Rs. 12,500
S.No Component (%) Amount (₹)
1. Swachhta Action Plan (10%) 1,250
2. Maintenance & Repair (40%) 5,000
3. Consumables (25%) 3,125
4. Sports & Play Material (15%) 1,875
5. Lab, Library & Teaching Aids (10%) 1,250
Total: Rs. 12,500 12,500

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages