టీచర్ పనితీరు సూచికలు (Teacher Performance Indicators)
SCERT కీలక ఉత్తర్వులు – 11.09.2026
Rc.No.ESE02-11021/113/2025-SCERT, Dt: 11-09-2026
- ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల Teacher Performance Indicators అమలుకు SCERT మార్గదర్శకాలు జారీ చేసింది.
- RTE Act–2009, NCERT నిర్దేశించిన Teacher Competencies ఆధారంగా ఈ పనితీరు సూచికలను రూపొందించారు.
ప్రధానంగా 6 Performance Standards
PS–1: Designing Learning Experiences
- 1. విద్యార్థుల పూర్వ జ్ఞానం, అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం
- 2. Learning Outcomes ఆధారంగా బోధన ప్రణాళిక
- 3. అన్ని విద్యార్థులను కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం
- 4. TLMs సేకరణ, తయారీ, వినియోగం
- 5. వివిధ Assessment Strategies వినియోగం
PS–2: Knowledge & Understanding of Subject Matter
- సబ్జెక్ట్‌పై స్పష్టమైన అవగాహనతో బోధించడం
- విద్యార్థుల conceptual errors, difficulties, misconceptions పరిష్కరించడం
PS–3: Strategies for Facilitating Learning 🔹 Learning Environment
- తరగతి గదిని సమర్థవంతంగా వినియోగించడం
- పరిశుభ్రత, విద్యార్థుల భద్రత
- ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రవర్తనా సమస్యలపై శ్రద్ధ
- TLMs, విద్యార్థుల పనిని ప్రదర్శించడం
- క్రమశిక్షణ, హాజరు మెరుగుపరచడం
🔹 Learning Strategies
- Learner-centred teaching
- Creative & Critical Thinking
- Inquiry, Investigation, Problem-based Learning
- Discussion, Debate, Cooperative & Collaborative Learning
- Physical + Digital blended learning
- Discovery, Exploration, Experimentation, Self-evaluation
- విద్యార్థుల ప్రశ్నలను ప్రోత్సహించడం
- ICT skills అభివృద్ధి
- Print & Digital resources వినియోగం
- Ethics, Values, Empathy, Compassion, Stress Management వంటి విలువల అభివృద్ధి
🔹 Communication Skills
- విద్యార్థులను ఓపికగా వినడం
- అవసరమైనప్పుడు విద్యార్థి Home Language వినియోగం
- సరైన Grammar, Spacing, Punctuationతో రాయడం
🔹 Assessment & Feedback
- Multiple Assessment Strategies
- విద్యార్థుల Learning & Performance Profile నిర్వహణ
- Tests, Assignments, Written Work, Projects మొదలైన రికార్డులు
- విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేయడం
PS–4: Interpersonal Relationship
- విద్యార్థులతో సానుకూల సంబంధాలు
- సహచర ఉపాధ్యాయులతో సంబంధాలు
- తల్లిదండ్రులు, సమాజంతో సానుకూల సంబంధాలు
PS–5: Professional Development
- Self-learning ద్వారా Subject Knowledge పెంపొందించుకోవడం
- అవసరమైన In-service Trainingలో పాల్గొనడం
- ICT & 21st Century Skills అభివృద్ధి
- Classroom Action Research
- Seminars/Conferences/Workshopsలో పాల్గొనడం
- TLMs మరియు ICT ఆధారిత వనరుల అభివృద్ధికి సహకరించడం
PS–6: School Development
- SMC/PTM/PTA కార్యక్రమాల్లో భాగస్వామ్యం
- వివిధ పాఠశాల కమిటీల బాధ్యతలు నిర్వహించడం
- Assembly, Time-table, Examinations, Sports, Cultural Activities మొదలైన వాటిలో బాధ్యతలు
- Guidance & Counselling, NCC, NSS, Scouts & Guides, Red Cross, Clubs తదితర కార్యక్రమాలు
- అధికారులచే అప్పగించబడిన విధులను నిర్వహించడం
మానిటరింగ్ విధానం
జిల్లా స్థాయి:
DEO → సంబంధిత MEOలతో రెండు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలి.
ఉపాధ్యాయుల Capacity Building, మెరుగుదల అవసరాలు, Performance Improvementపై సమీక్ష ఉంటుంది.
ప్రాంతీయ స్థాయి:
RJDs → సంబంధిత DEOలతో 3 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలి.
రాష్ట్ర స్థాయి:
ఉపాధ్యాయుల Competencies & Performance Indicatorsపై 6 నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో సమీక్ష ఉంటుంది.
⚠️ ముఖ్యమైన అంశం
ఈ Performance Indicators స్థిరమైనవి కావు. ఉపాధ్యాయుల పనితీరు, అవగాహన, ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కాలానుగుణంగా మార్పులు చేయవచ్చు. Capacity Building Training Modules కూడా ఉపాధ్యాయుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడతాయి.
ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయి.
📌 తూర్పు గోదావరి జిల్లా అమలు సూచనలు
DEO, East Godavari – Rc.No.2331-C3/2026, Dt: 01-10-2026 ద్వారా పై SCERT ఉత్తర్వులను జిల్లాలోని అన్ని MEOలు మరియు ప్రభుత్వ పాఠశాలల HMsకు పంపించారు.
👉 ఉపాధ్యాయుల Capacity Buildingపై సమీక్ష చేసి, Performance Indicators సమర్థవంతంగా అమలు చేయాలి.
👉 MEOలు ప్రతి నెలా DEO కార్యాలయానికి నివేదిక సమర్పించాలి.