Meebadi

  • 
  • Sitemap
  • search
Home » FESTIVALS » ఋషిపంచమి

ఋషిపంచమి

» FESTIVALS

వినాయక చవితి` మరుసటి రోజు వచ్చే పంచమిని  "ఋషిపంచమి" అంటారు .


ఈరోజు "ఋషిపంచమి" వ్రతము ను స్త్రీలు ఆచరిస్తారు.

 సప్త ఋషులు ఈరోజున తూర్పున ఉదయిస్తారు.

బ్రహ్మ విద్య నేర్వవలసినరోజు .

 సప్తఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి . . . గనుక బ్రాహ్మీ ముహూర్తముననే లేచి ధ్యానం చేసుకోవాలి . సప్తఋషులే గాయత్రీమంత్రానికి మూలగురువులు .

 మానవుని శరీరం లో ఏడు యోగచక్రాలు ఉంటాయి , వాటిని వికసింపజేసే వారే ఈ సప్తఋషులు 🙏🏼.

మొట్టమొదటిసారిగా వేదమంత్రాల్ని దర్శించి వైదిక ధర్మాన్ని ప్రవర్తింపజేసిన ఆద్య హిందూఋషుల్ని స్మరించే శుభసందర్భం... భాద్రపద శుద్ద పంచమి 🙏🏼.

1)కశ్యపుడూ, 2)అత్రి, 3)భరద్వాజుడు, 4)విశ్వామిత్రుడు, 5)గౌతముడు, 6)వసిష్ఠుడు, 7)జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లేమరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కుడా!🙏🏼

కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్

TEACHER CORNER

RESULTS
ZPPF / GPF
PFMS

Copyright © - Meebadi |