Type Here to Get Search Results !

We love reading Summer camp activities Day -4 (27.04.2024) Class- 3,4 and 5

 We love reading Summer Camp activities Day -4 (27.04.2024) Class- 3,4 and 5


Telugu Story reading :  

గర్వం పనికిరాదు

ఒక తూనీగ చెట్టుకొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రి అయింది. రెండు మిణుగురు పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్చగా తిరుగుతూ తూనీగను చూచి, గర్వంతో "ఓహో నీవా! తూనీగా! దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా? మేము వెలుగులు విరజిమ్ముతాము. ఆ వేలుగులో వెళతావా?" అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగ "మిత్రమా! నేను వెలుగు లేకపోయినా, ఎక్కడికైనా వెళ్ళగలను. కానీ మీరు మాత్రం పగలు బయట కనబడలేరు. నన్ను హేళన చేసేముందు మీరు ఏమిటో తెలుసుకోండి!" అన్నది తూనీగ. ఇంకా హేళనగా నవ్వుతూ ఈ ప్రపంచానికి మేమే వెలుగులు చూపుతున్నాము. మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసుకో అని గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగ "నేను గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు. ఎదుటవారిని కించపరచకూడదు.

 

                మేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు. మన కన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నా అని భావిస్తున్నారు. కానీ నక్షత్రాలు ఆకాశం లోకి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది. తళతళ మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అవి అనుకుంటాయి. కానీ చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాను అనుకుంటాడు. ఆ తరువాత తూర్పున, సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్న చోటు తెలియకుండా పోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు". ఎవరి విలువ వారికుంటుంది అన్నది తూనీగ. అప్పుడు మిణుగురు పురుగులు తమ తప్పుని తెలుసుకొని తూనీగకి క్షమించమని కోరాయి.

 


    ఈ  కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి 

  1.  మిణుగురులు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు తూనీగ ఎలా స్పందించింది?
  2.   మిణుగురులు  తూనీగతో ఏమని పలికాయి
  3.  తూనీగతో  మాట్లాడిన తర్వాత  మిణుగురు పురుగులు  ఏ అవగాహనకు వచ్చాయి?
  4. వినయం యొక్క ప్రాముఖ్యతను తూనీగ ఎలా నొక్కి చెప్పింది?
  5.  ఈ కథ నుండి మనం తెలుసుకున్న నీతి ఏమిటి

Pride is useless

 

A dragonfly perched on a tree branch. It was a good night. The two glowworms roamed freely with joy and saw the dragonfly and proudly said, "Oh you! Dragonfly! Are you lying here without knowing the way? We will break the light. Will you go in that finger?" Said sarcastically. At those words the dragonfly replied "Friend! I can go anywhere even without light. But you cannot be seen in broad daylight. Know what you are before you make fun of me!" That is a dragonfly. Still laughing scornfully, we shine light on this world. Know that this world will prosper because of us, they said. To those words, Thuneega said, "I should not be proud of myself that I am great. I should not insult others.

 

          We should never think that we are great. There are many people in this world who are better than us. In the evening you come out and think that I am filling the world with light. But as the stars come into the sky, your pride shatters. Those twinkling stars think that we ourselves are the light of the world. But after the moonrise, the starlight fades. The moon that appears in the sky thinks that the world is happy because of it and that it fills the whole earth with light. Then in the east, the sun rises. When the sun rises, the moon disappears in that light. We should never say that we are the greatest of this world". The dragonfly said that whoever values ​​them. Then the glowworms realized their mistake and asked the dragonfly to forgive them.

 Answer the following questions:

  1. How did the dragonfly respond to the sarcastic remarks made by the glowworms?
  2. What did the sparklers say to the dragonfly?
  3. What realization did the glowworms come to after their conversation with the dragonfly
  4. How did the dragonfly emphasize the importance of humility?
  5. What is the moral we learn from this story


PUZZLE 

Observe the picture carefully  and count 

  • Balls : 
  • children : 
  • Puppies : 
  • Books :



సరదాగా

కింది రాసిన వాక్యాన్ని 5 సార్లు ఆగకుండా చెప్పండి.

 

రెండు ఎర్ర లారీలు  రెండు పచ్చ లారీలు

 

గాడి లోన కందిపప్పు గాడి కింద పందికొక్కు


సూచన : ఇటువంటివి మరికొన్ని సేకరించి మీ స్నేహితులతో కలిసి అభ్యసన చేయండి


English Vocabulary 

       

1Almond Nut బాదం
2Cashew nut జీడి పప్పు
3Currant ఎండుద్రాక్ష
4 Dates Dried ఎండు ఖర్జూరం
5Fig అత్తి పండ్లు
6Groundnuts, Peanuts- వేరుశెనగ పప్పు
7 Pistachio Nut పిస్తా
8Walnuts అక్రోటుకాయ


Maths worksheets :


Do the Subtractions. 
(నోట్ బుక్‌లో వ్రాసి  లేదా  ప్రింట్ తీసి   , సమస్యలు సాధించి  మీ  టీచర్/స్కూల్ గ్రూప్‌కి వాట్సాప్ చేయండి.)
( Print or Write on note book and do the subtraction and watsapp to your teacher/ school group.)





You may like these posts also:



Show ad in Posts/Pages