Type Here to Get Search Results !

శ్రీ దత్తాత్రేయ శరణ స్తోత్రం


Click Here To Download Audio File 

శ్రీ దత్తాత్రేయ శరణ స్తోత్రం "
***********
1. దత్తాత్రేయ తవశరణం!
దత్తానాథ తవశరణం!
త్రిగుణాత్మక త్రిగుణాతీత త్రిభువన పాలక  తవశరణం!!

2. శాశ్వతమూర్తే తవశరణం! శ్యామసుందర తవశరణం!
శేషాభరణ! శేషభూషణ! శేషసాయిగురు తవశరణం!!

3. షధ్భుజమూర్తే తవశరణం! షద్ద్భుజయతివర తవశరణం!!
దండకమండల గదాపద్మ శంఖచక్రధర తవశరణం!!

4. కరుణానిధే తవశరణం! కరుణా సాగర తవశరణం!
శ్రీ పాద శ్రీవల్లభ గురువర నృసింహ సరస్వతి తవశరణం!!

5. శ్రీ గురునాథ తవశరణం! సద్గురునాథ తవశరణం!
కృష్ణాసంగమతరుతలవాసీ! భక్తవత్సలా తవశరణం!!

6. కృపామూర్తే తవశరణం! కృపాసాగర తవశరణం!
కృపాకటాక్ష కృపావలోకన కృపానిధే ప్రభు తవశరణం!!

7. కాలాంతక తవశరణం! కాలనాశక తవశరణం!
పూర్ణానంద పూర్ణపరేశా
పురాణ పురుష తవశరణం!!

8. జగదీశ తవశరణం!
జగన్నాథ
తవశరణం!
జగత్పాలక జగధాదీశా! జగదోద్ధార తవ శరణం!!

9. అఖిలాంతర తవశరణం! అఖిలైశ్వర్య తవశరణం!
భక్తప్రియా! వజ్రపంజర!
ప్రసన్న వక్త్రా తవశరణం!!

10. దిగంబర తవశరణం!
దీన దయాఘన తవశరణం!
దీననాథ! దీనదయాలా! దీనోద్ధార తవశరణం!!

11. తపోమూర్తే తవశరణం! తేజోరాశి తవశరణం!
బ్రహ్మనంద! బ్రహ్మ సనాతన! బ్రహ్మమోహన తవశరణం!!

12. విశ్వాత్మక తవశరణం!
విశ్వరక్షక తవశరణం!
విశ్వంభర! విశ్వజీవన! విశ్వపరాత్పర తవశరణం!!

13. విఘ్నాంతక తవశరణం! విఘ్ననాశన తవశరణం!
ప్రణవాతీత! ప్రేమవర్ధన! ప్రకాశమూర్తే
తవ శరణం!!

14.నిజానంద తవశరణం!
నిజపద దాయక తవశరణం!
నిత్య నిరంజన! నిరాకార! నిరాధార! తవశరణం!!

15.చిద్ఘనమూర్తే తవ శరణం! చిదాకార తవశరణం!
చిదాత్మరూప! చిదానంద! చిత్సుఖకంద తవశరణం!!

16.అనాదిమూర్తే తవశరణం! అఖిలవతార తవశరణం!
అనంతకోటి బ్రహ్మండ నాయక! అఘటితఘటన తవశరణం!!

17.భక్తోద్ధార తవశరణం! భక్తరక్షక తవశరణం!
భక్తానుగ్రహ! గురుభక్త ప్రియ! పతితోద్ధార తవశరణం!!

                                                       *🙏"శ్రీ గురు దత్తాత్రేయ నమో నమః
 శ్రీ సద్గురు పాదుకార్పణమస్తు!🙏
Tags

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages