********
రిపోర్టులు.....
రికార్డులు......
గ్రేడింగులు....
మీటింగ్ లు....
💐కరువైనది చదువొక్కటి!!!
వారోత్సవాలు....
దినోత్సవాలు.....
వీధుల్లో ర్యాలీలు...
పోస్టులేమో ఖాళీలు.
💐కరువైనది చదువొక్కటి!!!
డిప్యూటేషన్లు....
వర్క్ అడ్జస్ట్మెంట్లు....
ఇన్విజిలేషన్లు.....
ఎన్యుమరేషన్లు.....
💐కరువైనది చదువొక్కటి!!!
అరకొర వసతులు.....
అందని పుస్తకాలు....
ఆకస్మిక తనిఖీలు.....
అయోమయంలో గురువులు.
💐కరువైనది చదువొక్కటి!!!
సెల్ లోనే సమస్త సమాచారం
సెల్ ముట్టుకుంటే అదో నేరం
అన్నీ అత్యంత జరూరు...
ఆపై గురువులు బేజారు.
💐కరువైనది చదువొక్కటి!!!
కొత్తగా "అమ్మఒడి"...
బడిబాట హడావిడి....
గురువులకేది తీరుబడి...
బోధనంతా కొరవడి...
పడకేసిన ప్రభుత్వ బడి.
💐కరువైనది చదువొక్కటి!!!
ఆన్లైన్లో అప్పగింతలు....
పిల్లలేమో కుప్పిగంతులు....
వాస్తవాలకి కళ్ళగంతలు.....
సమాజంలో వెక్కిరింతలు.
💐కరువైనది చదువొక్కటి!!!
గురువులకు తప్పని యాతన
ప్రభుత్వ బడులంటే చులకన
కారకులు ఎవ్వరైనా......
ఫలితం మాత్రం సున్నా.
💐కరువైనది చదువొక్కటి!!!
💐కరువైనది చదువొక్కటి!!!
@@@@###@@@@
వాస్తవానికి "బడి"కి మూలం చదువు. ఆ చదువు కోసమే కదా విద్యార్థి. ఆ చదువు చెప్పడానికే కదా గురువులు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ది పేరున కోకొల్లలుగా పుట్టుకు వస్తున్న కార్యక్రమాలు చివరికి విద్యార్థిని ఆ చదువుకే దూరం చేస్తున్నాయి. 8వ తరగతి విద్యార్థి కనీసం 2వ తరగతి స్థాయి "కూడికలు" కూడా చెయ్యలేని స్థితిలో ఉన్నాడని చెప్పిన "అసెర్" నివేదికలు మన విద్య వ్యవస్థ లోపాలను వేలెత్తి చూపుతున్నాయి. బోధనేతర పనులనుండి ఉపాధ్యాయులను దూరం చెయ్యండి. బోధనకే అంకితం చెయ్యండి. సత్ఫలితాలు సాధించడం అరచేతిలో పని.
విద్యా వ్యవస్థ మనుగడపై ఆందోళన చెందుతున్న ఓ సాధారణ ఉపాధ్యాయుని ఆవేదనకు అక్షర రూపం.
*******