ఈ క్షణమే నీది
మరోక్షణం నీది కాకపోతే
అది ఎవరిదో !!
ప్రవాహ వాహకమే క్షణం
క్షణం క్షణం ఓ రణరంగమే
# ఈ క్షణమే #
చేతికి అంటిన మలినమైనా !
చేజిక్కిన మేలిమి కనకమైన !!
అది నీ చేతిరాతే !!!
నీ నుదుటిపై రాత కానే కాదు !!
నీకు నీవే రాసుకున్న మనో రాత !!!
# ఈ క్షణమే #
ఉన్నది పోతే రావడం కష్టమే
అది కాంతాకనకమైన , ధనమైన
పరువైన ఒకటే సుమా !!!
అధికారమైన , పదవి అయినా
ఒకసారి చేజేతుల జారిపోతే
తిరిగి దక్కడానికి కష్టతరమే !!!
ఉన్నదానిని చక్కగా ఉంచుకో బహుజాగ్రత్తగా !!!
# ఈ క్షణమే
రాకైక , పోకైన ,
లాభమైన , నష్టమైన
సుఖమైన , కష్టమైన
ఆనందమైన , ఆవేదనైన
రాజుకైన , పేదకైన
ఒకటే క్షణం !! క్షణం ఒకటే
అందుకే ఈ క్షణమే నీదే
సరిదిద్దడం నేర్చుకో ... జాగ్రత్త సుమా !!!!
# ఈ క్షణమే #
** చురకశ్రీ ** సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ కావలి