నర్తించే ఓహో అందచందాల అభినయనేత్రి ధని !
ఒయ్యలు వొల్లకబోచ్చే వయ్యారి నటరాజ ప్రియ మైత్రి తరుణి !!
కలువ కన్నుల అభినయాలు సందడి శృతిని జతచేయ నాట్య కళామయూరి !!!
నీ అందెల సవ్వడి ఘల్లుఘల్లు మన
మా గుండె స్పందన చప్పుడ్లు ఢమరక నాదాలు పలుకగా జవ్వని !
నీ కరముల లయ ఉయలు కన మా నరముల్లో రక్తప్రవాహం ఉరకలువేయ,
నీ పాదచప్పుడ్లు శివతాండవం చేయ మా శరీరం ఉద్రేకాన్ని కలిగించగా కాహళి !!
అంతలోనే నీ పాదపద్మములు శాంతసం న నెమలి నడకలతో వసంతోత్సవం గా మారి మనస్సు ఉల్లాసభరితమైయ ఓ సరిగమ సిరిసిరి మువ్వ !
ఏ?మేమి? నీ నాట్యనటన కౌశల్యం శతకోటి కన్నుల సంబరాలజాతర కౌసల్య మణి !!
అది గాంచిన పండితులే కాక,పామరులు సహితం నీ పాదదాసులై,
సృష్టిలయకారుడైనపరమేశ్వరుడు సహితం నిన్ను పరిపరి విధాలుగా మెచ్చి నీకు ఇచ్చే వరాల వరద ,
మేరుపర్వతపు హిమసముహాలు పూలచెండులై నీ శిరస్సుపై అలంకరణ అయ్యేనే నెరజాణ!!!
గంగా జటాయువులనుండి మెల్లమెల్లగా జారీ నర్తకి నుదుట "మాటి" గా అలంకరణ అయ్యే భామా !
ఆ జడకుచ్చుల గిర్రగిర్ర విసుర్లు ఆ "గిరీష" త్రాచు వలె నాట్యం చేయ,
సాంబుడి మెచ్చుకోలుగా మేరుపర్వతశిఖరాలు చెవిదిద్దులుగా మారె,
ఆ మెడలోని చంద్రహారం ఆ శంబుని శిరస్సున ఒదిగిన చంద్రహారం జారి నీ యద పై చేరే ఓ అందాల నాట్యభరణి !!
చేతనున్న త్రిశూలధారి ఆయుధం నాభి చూట్టూ యంత్రం అయ్యే,
ఈశ్వరుని ఢమరుకం నీకు అయ్యే నీ కాళ్ళి అందెలు జవరాల !!!
నిన్ను గాంచి ధరణి హర్షించే ఓ నాట్య మయూరి తరంగిణి
రచన..చురకశ్రీ,
సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్, కావలి.