ఓ చిన్నదాన,నా మనస్సు నకు నచ్చినదాన,
నా వెంట నీవు రాలేవా !
అప్పుడు నా కంట పడక,
నే నీ వెంట పడక,
నా చే జారిపోతివే కుర్రదాన , ఓ నా
ప్రేమనగర్ గడసరిదాన !!
ఈ నాటికి నా కంట పడి
నా వడిలో ఒదిగిపోవా చిలిపిదాన;
నా మనసు అంతా నీవేనే ఓ సొగసరిదానా!!
ఇకనైనా,రా
చెంతకు చింత వదలి;
అయినా నిన్ను నే చూసాకా!!!
మనసు ఆపుకోలేక ,నా ప్రేమను చంపుకోలేక !
ఇదే ;
నీపై నా మనోభావన సఖీ !!
ఆ చంద్ర బింబం లాంటి మోమును చూసాకా !!!
మనస్సు ఉప్పెన ( లాడదా) అయి ఉరకదా,
ఆ పచ్చపచ్చ వర్ణాలను చూసాకా ! నా పరువం ఆగుతుందా,!!
ఆ నేత్ర వజ్ర కాంతులు బండరాయిని సహితం పానకం చేయదా !!! ప్రియతమా!
నీ యదలోతులను కనిన పిదప
నా హృదయ తరంగాలు ఊయలు ఊగవా!! నా ప్రియమణి ,!
ఆ కనులు నన్నే సైగలు చేస్తూ పలకరిస్తూ ఉంటే ;
నా కనులు సహితం నీ చూపుల ఊపులో ఒదిగి పోవాలని ఎదురు చూస్తూన్నాయి ;నా ఇష్ట ప్రియమణి !
ఆ చూపుల అలజడి నా మదిలో జడివాన అయింది;
మరి నీలో ఏమైందో ఏమో; నీవే సైగ చేయాలి నా ప్రాణ సఖి !!
ఒకటి మాత్రం నిజం అదే
నీ నవ్వుల ప్రకంపనలతో
నా అంతరంగం తడిసి తడిసి ముద్ద అయి ;
అనంత రాగాల పల్లవి అయి
ఆనందాలహరివిల్లు అయి
శత ఇంద్రధనస్సు యశస్సు అయి
నీ, నా అడుగుల సవ్వడలు సరిగమ పదనిసలు అయి
రా! రారా!! అంటూ పిలుస్తూన్నాయి ఓ నా దేవి;
ఓ పసిడి వర్ణశోభిత మణిదీపకా;
అందచందాల మనోహర రూపికా!!
ఓ మనసులో పదిల మైన ఓ మహీ!
నీతోనే జత చేయమని ప్రేమ రధసారధి మన్మధుడు కోరేన్;
ఇక వేగిరపడు;
లే ,నీవు
నవ రతివై;
నే
నవ మన్మధుడనై;
ఇక నిన్ను నన్ను ఏ ఒకరు
ఆపలేరు,ఆపలేరూ ...ప్రియా!!
ప్రేమాతో....నినే కోరే నీ చెలికాడు
చురకశ్రీ... సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ ,కావలి