అరె అరే పార్లమెంటు గడ్డమీద
కూడుపెట్టే రైతు బిడ్డ తిరగబడె,
అసెంబ్లీ అడ్డ మీద మడి భూములు ఇచ్చి కదంతొక్కే కర్షక పోతు ఆడ బిడ్డలు !
రోజుల తరబడి తలరాతులు తిరగబడి టెంట్ ల్లో కూలబడి,
ఆశతో ఆశయం కోసం ఎదురు చూస్తూ చూస్తూనే ఉన్నారు,
ఎందుకో,దేనికోసమో ఆశల పల్లకి వొలికి వెక్కిల్లిస్తూంది !!
మోసపోయింది ఎవరో,కడుపుమండిది ఎవరికో !
లాఠీ దెబ్బలు తిన్నది ఎవరో,మౌన నిరసనలు, పోరాటాలు పడుతుంది ఎవరో !!!
ఆరాటాలు చెందుతున్నందిఎవరో,
జలఫిరంగుల తరంగాల వలయం చిక్కుకున్నది ఎవరో !
మునుపుఎప్పుడు పడని పాట్లు పడుతున్నది ఎవరో !!
ఆ ట్రాక్టర్ల రణగొణ ధ్వని నాదాలు
ఆ కేకలు ఎవరివో !
ఆ ఉరకులు ఎవరివో ఎందుకో !
ఆకలి తీర్చే నాగలి పట్టే రైతన్న ఏమిటి అన్నా !!
నీ రోదన, నీ ఆవేదన నీ నివేదన
వినేవారు కరువు అయ్యారా !
అలకించేవారే లేరా? అంత తిలకించేవారేనా ?
లేక , ఆనందించేవారనా?రైతే నాదేశానికి వెన్నుముక ఊతవాదమేనా ?
దేశానికి రాజు రైతన్న అనేది ఒట్టిమాటేనా?
జై కిసాన్ ఒక నిషాన్ యా!
ఓ భరతమాత పాలకబిడ్డలారా !!!
ఏమిటి మీ పంతం ఎన్ని ఆత్మార్పణాలు జరగాలి;
ఏలాంటివిధ్వంసానికి దారితీసిన పరిస్థితులు రావాలా?? కావాలా??
ఆగండి, ఆపండి!! వారి అలికిడి నాగలి పట్టిన పిడికిలి చాలా బలిష్టం!!!
మానవాళిబలి నష్టం జరగకుండా చూడండి !!
భూపాలక బిడ్డలారా!! మీ బలం వారు ఇచ్చిందే నాయనా !
బలం,బలగం పదిలం కానేకాదు, అది నిరంతర ప్రవాహం మారుతూ, మరొకరకు చేరుతుంది ఇది కూడా తెలియనిది కాదే ?
అందుకే చాన్స్ తీసుకోండి,
లేకపోతే చానెల్ మారుతుంది !!
ప్రజాస్వామ్య రాజపాలక పుత్రులారా!!!
ఇప్పటైనా నా మాట వినరండి ...ఇట్లు మీ భరతమాత !
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్, చురకశ్రీ, కావలి.