ప్రియా! ప్రియా!! ఓ నా ప్రియా !!!
నీవే నా మస్తకంలో నిలిచిన
మరువపు పువ్వా !
నిన్ను నేను ఎలా మరువగలను
ప్రియా!
నా యద లోతుల్లో దాగిన చెరగని పుస్తకం నీవే!!
నీ పాదాల అలికిడి నాలో ప్రేమ తరంగాల అలజడి !
నీ శ్వాసే నా మనోనేత్ర ఆశయాల శ్వాసల తడి !!
నీ ముద్దమందారపు చెక్కిళ్ళు నా చేతి చిటిక్కెళ్ళ సరదాల తాకిడి!
నీ స్వరధ్వని నా కంఠ సప్తస్వరాల నాదాల సవ్వడి!!
నీ యద పొంగళ్ళు నాహృదయ గంటల గుడి!
నీ వెచ్చని వడి నా అసలైన ఆశలపల్లకి అంతరంగపుదొంతరలు !
నీ జ్ఞాపకాలు నా వ్యాపకాల కావ్యాలు !!
నీ మాటలు నా జీవనసరాగాలు !
నీ స్పందనలు నా శ్వాస లయలు!!
నీ అడుగుల చప్పుడ్లు నా మనస్సున డప్పులు !
నీ అందచందాలు నా జీవిత మనోహర విలాసలు !!
నీ విలాసం నా విలాసమై వికసించవా? పువ్వా !
గువ్వలా నాలో ఒదిగిపోవా !!
దివ్వలా వెలిగిపోవా నా గుండె నిండా !
కాలి మువ్వలా నా అడుగుల జతలో చేరిపోవా !!
ఓ నా చెలి,
ఓ నా నెచ్చెలి !
ఏంటావు? ఇంకా ఏం ఇంటావు?
నా సఖీ ! ఓ నా ప్రాణసఖీ !!
ఇక ఉండిపో నా సతీగా నా ప్రియ ప్రాణసతీగా!
రచన: సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్, చురకశ్రీ, కావలి