పంట సాగు నాగలి పట్టిన అన్నదే కాదుఅన్నా ;
పెట్టుబడి పెట్టిన దొరదే !
ధర కూడా ఆ పెత్తందారి దొరదే !!
"ధరలోన" ధర ఆకాశం చేరున్ !
ఆపై పేద,మధ్య, ధనిక వర్గాల దురద తీరున్ !!
లొసుగులన్న చట్టం సరిదిద్దడానికి సంకోచం ఎలా రాజపాలకా !
ఇదిభూపుత్రల అక్రోషమే కదా,
కదిలే బతుకు బండి చక్రాలు ఆగిపోతే,
మెతుకులు అందించే చేతులు తిరగబడి లేస్తాయి !
మండీదళారీల కబంధ హస్తాల బూచినుంచి పెత్తందారుల విషపు కోరల్లో !!
బక్కచిక్కిన హాలికుడు నలిగి నలిగి వాడిపోయి రాలిపోవున్ !
పై చేరి చప్పుడు చేసేవారికి ఏమితెలియున్!
బురదమన్నులో బువ్వను అందించే కృషీవలుడి వెతలు !
కర్షకుల కాయకష్టనష్టాల స్వరాలు;
వింత వింతగా క్వవింతగా ఉండున్
చట్టాలను సమర్దించే వారి స్వామిభక్తి కతలు;
లాఠీచార్జీ,బొందకుల(తుపాకుల)మోతలు దాటి;
హలంపట్టిన హలదారులపై జలఫిరంగులు ఏలా ?
భారతబంద్ దాకా చేరాయే పసిడిని పండించే రైతన్నల నిరసనలు;
చట్రంతయారీలో లొసుగులు ,మతలబులు( మతలాబులు) దాగయా ఓహో పాలకా!
తాసులో తిరకాసు దాగిఉందా నాయకా !!
చేయిదాటితే కూర్చున్న కుర్చీ తక్కిట తక్కిట తద్దిమి తోమ్ !
రోమ్ నగర్ తగలబడితే ఫిడేలు వాయించినట్లు !
కర్షకులు,రక్షకులు,అర్చకులు ,పేదకర్షకకూలీలు రోడ్డున పడితే;
ఇక చిడతలు వాయించుకోవడమే ఓ ఏలికా !! బహుళ జాగురుత మసలుకో;
ఇకనైనా మేలుకో పట్డువదలు మెట్టుదిగిరావయ్యా! సర్దుబాటు చేసుకోవయ్యా ఓ మహానుభావా!! ఓ ప్రజా జనరక్షకా !!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్, (చురకశ్రీ,), కావలి