###################
చిలుకా,చిలుకా పుత్తడికాంతుల సీతాకోక చిలుక!
ప్రకృతిని చూసి ఆశపడి ఎందాకా? నీ లేడీ పరుగు;
పైటను గాలి గుమ్మటం చేసి ఎగిరే బుట్టబొమ్మా !!
అందాలు వలకబోసే వయ్యారి దానవు నీవే !
సొగసుల ముచ్చట్లు గొలిపే చిరునామావు నీవే !!
నా మనమున సదా నిలచిన అభినయనేత్రి ప్రతిరూపం నీవే!!!
మలి సంధ్య వేళ సాగర తీరాన విభిన్న వర్ణ అరుణా కాంతిపుంజాల సమూహల నడుమ;
నీ మనస్సు నెమలి నాట్యం చేసే నా నాట్యభరణి నీవే !
భువి నుంచి ఎగిరి జలతరంగ అలలు దాటి అశ్వపు పరుగున!!
నింగిన అప్పుడే మినుకు మినుకు లాడే తారలను;
ఒడిసిపట్టి మేఘాల లతకు చుట్టి మెడలో పూల హారం చేయతలంచి;
ఎగురుచుంటివే ఓ నా కోమల లతాంగి !
నీ ఆశకు హద్దుపద్దు లేదయా ఓ నా కోమలి !!
అది అందని ద్రాక్ష అని తెలియదా దాక్షాయణి!
పరుగెత్తి పాయసం తాగ్గే కన్నా తగ్గి నిలబడి నన్ను చూడు;
నా అంతరంగ అందం చూడు నేను నీకు సరిజోడు;
కాస్తంత జోరు ఆపి నా వైపే చూడు, నీవే నా ఈడుజోడు ఈనాడు సుందరాంగీ!
నీపై నాకు ఎన్నో ఎన్నో ఆశలు ఊసులే హృదయ మంజరి!!
నీ తలపుల వలపుల్లో నేను అలాగే ఒదిగి పోవాలని !
నీ యద అంతరంగ తరంగాలను తాకి స్వేద తీరాలని
నీ బాహువుల్లో నేను ఇల కలకాలం బందీగా ఉండాలని
నీ వెచ్చనివడిలో మచ్చికగా నిదురపోవాలని నా తీరని కోరిక!!
నీవు ఎలాంటి మెలికపెట్టబాకే ఓ నా మనో నెచ్చెలి!
ఏంటావు ? ఆ అందని నక్షత్రాలు జోలికి వెళ్ళమాకే !!
నేలపై నీకోసమే ఎదురు చూసే ఈ నిత్య ప్రకాషిత నక్షత్రకుడను గాంచి
నా బాహువుల్లో చేరిపోవా ఓ నా భాగ్య తారామణి!!!
ఇల కడవరకు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండిపోదాం ఆనందాల లహరి నగ్నిక!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) ,కావలి.