#######################
రూపమా రూపమా అందమైన సజీవచిత్రమా !
ఓ అపరంజి చందనాల చందమామ నగు మోము చంద్రవదన !!
అందాల లే లేత వర్ణ నాటు గులాబీ అభిసారిక !
మీన కన్నుల అభినవ ఇంద్రలోక తారక !!
నుదుట ముచ్చటైన ముత్యపు బొట్టు అద్దిన బుట్టబొమ్మ !
చూడ చక్కని నిటారైన నభము గల నెరజాణ !
నభమున పెనవేసిన తళతళలాడే ముక్కెర ముద్దుగొమ్మ !!
దొండపండులాంటి పెదాలసమూహ దొరసాని హారిక !!!
ఓ! సమ్మోహినీ ఆ రూపులో ఊపుఉంది చిన్న దాన !
నీ చూపులో అల్లకల్లోలం ఉందే కుర్రదాన !!
ఆ పెదాలచాటునదాగిన నీ నవ్వు లో మకరందపు పిలుపు ఉందే కొంటె మందాకినీ !
నిన్ను వదలి నే కదలలేనే కన్నెపిల్లా !
నిన్ను వలచి నే మరచి పోలేనే పడుచుపిల్లా !!
నీ కన్నుల సైగలు రైరై అని కవ్విస్తూ ;
నీ చెంపల సొగసులు బైబై అనక లాగేస్తూ;
నీ నిలువైన ముక్కు నన్ను బంధనం చేస్తూ ;
నీ పెదాల కదలికలు సైసై అంటూ నవ్విస్తూ ;
అలా అయితే ఎలా నీ నుంచి జారిపోగలనా జవరాలా !!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ ( చురకశ్రీ), కావలి