#######################
పూలవనంలో విహరించే దూది ధని ;
సిగ్గులతో వొలకబోస్తూ చిందేస్తూన్న ధ్వనివి !
నవ్వులతో హర్షించే హంసయాన ;
తియ్యతియ్యని స్వరాల అల్లికల కదలికలు ;
సున్నిత మృదువైన చెక్కిళ్ళు
వర్ణ కంపనాలతో జపం చేయగా !!
పెదాలు ముచ్చట్ల ఆటకు ఆరాటపడే !
శ్వాస తదేక ధ్యాస తో ఊగిసలాడే పావని నీ మనంబున !!
నీ నడకల సవ్వడులు నా యదలో గుడిగంటలు / జై గంటలాడే !
నీ వలపులే మధురమైన పలకరింపులు !!
అవే నాకు ప్రియమైన నీ పిలుపులు !
నీ మస్తికంలో దాగిన నా ముద్రణ చిహ్నాలు !!
నాపై కురుపించే జడివాన చినుకులు!
నీ కన్నుల చాటున దాచిన నా వర్ణ చిత్తరువులు !!
ఆ సిగ్గు నవ్వుల సంగమంన నీ యద పొంగళ్ళ వరదలు నా మరదాల !!
నీ ఉదరం న పొంగే జలపాత గిలిగింతలు ,!
ఇక నిలువలేక చెంగున చేరే నా యద పై శిరస్సు వాల్చే !!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్, చురకశ్రీ, కావలి.