అల్లాడిపోదురు పసిమొగ్గలు
రాలిపోయే పువ్వున్ గాంచి
ముసి ముసి నవ్వున్ వికసించే పువ్వుల్
తపనతో అల్లాడి పోవు మొగ్గలు
ఆ లేమొగ్గలపై ప్రేమాభిమానాలే రాలేడి పూల జీవం
సరస సలాపాలాడేడి కులుకేడి సంసార పూలు
అడ్డుగోడలని , రాలిపోయెడి పూలన్ , వదలి బొచ్చు కుక్కలన్
పట్టుపరుపు పై పరుండపెట్టున్
ఆవే కాపలా , కాలక్షేపం
పట్టేడన్నం పెట్టలేని బిడ్డల్ ,
కాటికకు కాలు జాపి , వారసత్వ
మొగ్గల ఆనందాలకు దూరానా
వృద్ధాశ్రమం ,
గుడి మెట్ల కాడా , రైలు , రహదారులు వెంట బిక్షాటన !!
ఏమిటో చిత్రం !!! విచిత్రం !!!
టక్కరి పూలు ఎరుగవా రేపటి రాలిపోయే పువ్వులని మన ఈ మొగ్గలు నేర్చి బుద్ధి చెబుతాయి అని , అక్కటక్కటా ఈ టక్కరి పనులు చూసి అల్లాడిపోదురు పసిమొగ్గలు !!!
##### చురకశ్రీ ##### సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ కావలి .