Type Here to Get Search Results !

నా యద జారి నీ యదపై వాలుతుందే ఓ నా...

0

 చక్కదనాలు అద్దిన అందాల సొగసిరి;


పకపకనవ్వుల రాగాల సింగారి రాణి !


ఊయలలో ఊగే చేమంతి పూవ్వ!!


పాలనురుగుల పూ బంతి;


నాలో లీలమై నన్నే  పలకరించే పల్లవి!


గాలి అలలలో గలగలలాడే గాజుల గజాల!!


చిలిపికన్ను సైగాల తాకిడితో నన్ను ఆరాటపెట్టకే  ఓ చిత్రాంగి!


నన్ను అలా ఊరించకే నే ఆగలేనే  ఊర్వశి!!


ముసిముసి నవ్వులు హరివిల్లులా విసిరే గువ్వ !


నన్ను ఇలా ఉడికించకే చందనాల సుగంధ  చిలిపి చిలుక !!


నీ ఊపుల చూపులతో  నే  తాలలేనే

సరసపు సొగసైన  సిరి మువ్వ !


నీవు అలా ఊగుతుంటే నా మది

గతితప్పి;


జలధరిస్తూందే ఓ! జాణ!! ఓ యీ ! నెరజాణ!!


నీవు అల ఇలా కవ్విస్తూ ఉంటే ;


 నా యద జారి! నీ యదపై చేరుతుందే;


ఓ! నా  సీతాకోకచిలుక!!


రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages