ఓ పసిడి పూత నా నుదుటి గీత
నా రాతలో నువ్వే! నువ్వే !!
దాగి దాగి కోయమాకే నా గుండె కోత!
దాచి దాచిన నీ అందాలు కనువిందు చేయవే ఓ నా హృదయ లత!!
వలచిన నన్ను మైమరిపించగా రావే ! దాగుడుమూతలు వలదు! వలదు!! సల్లగా రావా! మెల్లగా నా ఒడిలో ఉండిపోవా! నాసొట్టబుగ్గల మైనా!!
నన్ను అలా ఇలా కవ్విస్తూ జారమాకే! నా కలల జాణ ! నవ్వుతూ నా ఎద దరిలో చేరు ఓ నా చేమంతి పూవ్వ! !
నీ వోణి సరస రస భావనల లిఖితాల సంకేతాలు! నాలో ఉత్తేజిత ప్రేరేపిత మాధురి మాల చందన సుగంధాలే! ఓ సఖీ!!
నీ వలపులు నాలో రేగే ఆశల పరవళ్ళు అవి నాలో తగిలే ప్రేమతరంగ పవనాలు!
కళ్ళగంతలు ఆపి నాలో ,నాతో కొలువు దీరు !ఓ! నా చాందిని!!
నే నచ్చి నా కోసమే వచ్చావు,ఏలా నీ లీలలు? పంచ వర్ణాల ముచ్చటైన చిలిపి చిలుక/ సీతాకోకచిలుక!!
రచన.సయ్యద్.హయ్యూల్ హయ్యూమ్ ( చురకశ్రీ )కావలి.