కాలం మారుతున్న బంగరు బాల్యం
కాయానికి ఇంకా గాయాల మయం
సుడిగుండపు గాలాల నీడలో నలుగుతూ,మగ్గుతూ;
ఊగుతూ తుళ్ళుతున్న గుల్ల అవుతున్న పసి తనం!
పలకాబలపం పట్టనియవ్వు,పుస్తకాల చెంత చేరనీయక కుటుంబపోషణలో తాను బందిఖాన ఈ పచ్చని బాల్యం!!
చెమటలు గక్కుతున్న ఎండలమంటలో రాళ్ళ గుట్టల్లో,
తట్టబుట్టలతో,పలుగుపారలతో పంటపొలాల వెంట!
మోటరు ,హోటల్లో,కారుషెడ్డుల్లో,సైకిల్ షాపులో, పరిశ్రమలలో బాలలే బాలలు!!
చిన్నిచేతులతో చిన్నాపెద్ద పనులు చేసే ఈ బిడ్డలు అన్నింట! గడ్డపారలతో గుంటలు ,గడ్డి మోపుల మోతలు, కొడవలి కోతలు కందెచేతులు మాయని గురుతులు!!
బడి గంటల గణగణలు విన్నరావు,విన్నపోలేరు!!ఈ మొగ్గలు
వానలో,చలిలో ఆసరా లేని బతుకులు వెళ్ళదీస్తున్న బాల్యం వెక్కిరింతలు నోటి వాకలిలో ఆకలి పిలుపులు చదువు సంధ్య లను పట్టనియ్యవు! కొండ బండ రాళ్ళను పగలగొట్టడం,పిండి చేయడం,
సుత్తి ఉలి తో ఆకృతులు ఇవే వారి జీవన కవాతులు!!
బాల్యం చితికిపోతు వారి ఉన్నత్తిని ఒత్తి ఒత్తి చిత్తుచేస్తుంది ;
సమాజ ప్రగతి చక్రాలు నలిగి నలిగి చిత్తై, బాల్యం కరిగిపోతు! ఆరిపోతుంది!!
కలి లో కల గానేనా వీరి హక్కులు
ఇలలో ఇలా వారి వాక్కులకు సరస్వతి కటాక్షం లేదా? సంపూర్ణంగా రాదా?!
ఉచితాలు ఎక్కడ? సంరక్షణ ఏడా? చట్టాల అమలు ఏది?!!
సరిచేస్తే ఏ బుర్రతొర్రలో ఏముందో? లోకానికి అది అందించే వరమే మరి బాల్యం మధురం కావాలి, దానిని అందరూ పొందాలి అప్పుడే పరిపూర్ణం
రచన..సయ్యద్. హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.