తల్లి తండ్రి తానైన ;
తల్లి ని త్యాలేడు,నాన్నను చూడలేదు చుట్టాలను చుట్టనులేడు!
వేళకు తిండి తిప్పలు ఉండవు; ఎవరో ఒకరు ముద్ద పడివేస్తే అదే పరమాన్నం!
వీధి నీరే అమృతం!! గూడులేదు పాడులేదు! పాడుపడ ఇళ్ళ మెట్లు,అరుగులు, రోడ్డు వెంబడి చెట్ల నీడలే పట్టు పరుపులు!!
పురుగులన్న అవే నేస్తాలు,ఒకరి ఒడి మరొకనికి ఆత్మ బంధం అనురాగ సంగమం!
రోదనలున్న వేదనలున్న ఇంకిన కన్నీరే సర్వరోగ నివారిణి!!
మోయలేని భారంఉన్న బాధ్యత మరవక ;
మరకల బతుకును,అతుకుల జీవనాన్ని నెట్టుకొస్తు!
ముందుకు పోయే జీవితాలు అనంత అంతరంగ మధురిమలు!!
చేరదీసే చుట్టూతా! ఉన్నవారే చుట్టాలు! అవే ఆనంద సంబరాలు,!!
భయాలున్న, బిక్కుబిక్కు మంటున్న నలు దిక్కులు తమవే!
అదే వారి సర్వస్వం బాధల శృతిలయ సరాగాల స్వరాలు!!
అన్నింటిని నరాల సంద్రం లో అనుచుకొని ;
ప్రేమ ఆప్యాయత లను మనసులో దాచుకుని ;
గుండె లోతుల్లో కలతలను సమాధి చేసి !
నిబ్బరమైన నిలువెత్తు సాక్ష్యాలు!! ఈ అనాధలు!!!
తప్పు వీరిదా? తల్లిదండ్రులదా? సమాజానిదా?
సృష్టించిన బ్రహ్మ దా? ఎవరిది? ఇంకెవరిది?
రచన.. సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.