పాల సంద్రం నుంచి ఉద్భవించిన శ్వేత బింబమా;
కడలి దాటి వనం చేరి నా ఆశల ఊయలలో ఊగుతూ ఉంటే ;
ఆ పవనాలతో నీ సువాసనలు నా మదికి తాకి ;
నది లా నిన్నే చేరాలని కదిలే నా అడుగులు;
ఓ పాలబుగ్గల సింగారిరాణి!
నా మనస్సు తుళ్ళితుళ్ళి పడి తొలకరి చినుకులా నీ సిగను అందుకోవాలని;
నా ఆశలు రెప రెప లాడే ఓ బంగారు మణి!!
నీ లయలు హొయలు నా హృదయ లోయల్లో ఉప్పొంగే కితకితలు ఓ నా మనో పుష్పదీపిక!
విరబూసి మకరంద పరిమళాలు వెదజల్లే నాలో;
అవి నీ కోసమే! సుందరాంగి!! నీ రాక నా కోసమే! నే వచ్చేది నీ కోసమే!!
నిన్ను నే చూశాకా నా మనసును ఆపుకో లేక నే నిలువలేక ,
నీ వెంట పడిపడి నా ప్రేమ తపన నీతో మనసారా! విప్పి నీ కోసమే నే నని నా కోసమే నీవని !!
మనమిద్దరం ఒకే గూటి జంట ప్రేమ పక్షుల న్ని ;ఆ ప్రేమకుటీర వనం మనదేనని ;
అందు మనమే ఆనందడోలిక లాడుకుందాం !
ప్రేమ జంటై జైగంట"లవు"దాం
ఏం అంటావూ!!
బ్రహ్మ సృష్టించిన పసిడి రూప శ్రీ!
రవివర్మ గీసిన బొమ్మ !!
ఇంపైన వంపుసొంపుల చందనాల రెమ్మ !
నా మదిలో మెదిలే కదిలే ఊయల ఊగుతూ మత్తేకించే ఉత్తేజాన్ని కలిగించే .....ఓ నా స్వర్ణముఖి/ ;
నా సరసన చేరే సరస వికాస పుష్పమా!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.