కొంటె చూపుల సక్కనైన సంజ్ఞ సుందరి ఆహా ఏమీ ఆ నీ
ఆ నవ్వుల చూపులు ఏదో మర్మం దాగేనో నాట్య మంజరీ !
నీ చుర కత్తి చూపులతో నీ అభినయ ఊపులతో కట్టి పడివేసే అభినయశ్రీ !!
మోహనకారుడినే నిలువరించే శక్తి నీ చేతి కొన వేళ్ళిలో దాచావు కోమలి!
వయ్యారాలు వొలకబోస్తు అందచందాల మొలకలను ఆరబోసావు అందాల భరణీ!!
నక్షత్ర కుహరపు వెలుగులో వెలిగే జ్యోతిశ్రీ !
మొహంతో మత్తు ఎక్కించి ఊపిరి నింపే మోహనరూపిణీ!!
ఆ కన్నుల సైగలు మహా ప్రయోగశాల, అద్భుత ప్రదర్శన వరదల వేదిక!
అందుకుంటే బహుమతి లేకుంటే అధోగతి బహుమతి ఇస్తావో,అధోగతి పాలజేస్తావో నీకే ఎరుక !!
నీ కన్నుసైగల చప్పుడు నా గుండె లయల డప్పులు భాగ్యశ్రీ !
దరి చేరితే చింతలేదు లేకపోతే ఆగిపోవు జీవం జీవితశ్రీ !!
నీ వాలకం చూస్తే అలా కాదని అనిపిస్తుంది నాట్యశ్రీ!
ఆ చూపులో నిశ్శబ్ద విరామాల సమ్మేళనం!
సమ్మోహన రాగపు స్పర్శల మిళితం కానవచ్చే కన్యశ్రీ!!
హృదయాన్ని అల్లుకొని హత్తుకునే హృదయ తరంగశ్రీ!!!
రచన..సయ్యద్. హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ )కావలి.