రెండే మనస్సులు, రెండే చేతులు ,అనేక కసరత్తు లు
ఒకే షరతు, ఒకే బంధం వీడని ఒకే అనురాగ సంగమం !
మమతల కోవెల,అనుభూతుల అనుబంధం !!
జత స్మృతుల శృతిలయలు, సంసార సాగరమున పయనించే సప్తవర్ణాల నావ జీవిత చదరంగం!
ఒడిదుడుకులు ఒడంబడికల ఓదార్పుల జీవనయాత్ర !!
మరిచిన మరువలేని తీయని చేదుల కలయిక !
అది కఠినమైన సులువైన తప్పనిసరి పయనం అదొక పఠనం!
అదొక పుస్తకం!! అదే పుస్తెల శతకం!!! అదే పెళ్ళి పుస్తకం!
ఇరువురు గీసుకున్న సంతకం!! ఇరువురు పంచుకునే పతాకం!!!
చుట్టూతా సుడిగుండాల కలతలు వున్నా !అవి మధుర జ్ఞాపకాలతో వీడే స్వప్నాలే!
మండే సుడిగాలులు వీచిన పడి మండని, వీడని, వాడైనా సుగంధ రక్షబంధనం !!
భాష ఏదైనా, కులం ఏదైనా మతం ఏదైనా జాతి ఏదైనా వర్ణం ఏదైనా చెక్కుచెదరని చెక్కిన శిలాశాసన ఫలకం !
ఇక ఇకలు పకపకలు ఉన్నా లేకున్నా అది మనోరంజక ,మనోహర ద్విబంధ ఏకనిబ్బరం అరవింద పరిమళం
అదే జత! అవే కత(థ )లు!! ప్రేమలు!!!
రచన.సయ్యద్. హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ )కావలి.